King Charles : బ్రిటన్ రాజు 75 ఏళ్ల చార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయింది. అయితే అది ఏ రకమైన క్యాన్సర్ అనేది బకింగ్ హాం ప్యాలెస్ అధికారికంగా వెల్లడించలేదు. క్యాన్సర్ సమస్యపై అవగాహన పెంచడం కోసమే ఆయన తన చికిత్స గురించి బయటకు వెల్లడించారని కింగ్ చార్లెస్ ప్రతినిధి తెలియజేశారు. ప్రస్తుతం ‘ఔట్‌డోర్ పేషంట్’గా ఇంట్లోనే ఆయన చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కింగ్ చార్లెస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పింది. త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని బకింగ్ హాం ప్యాలెస్ పేర్కొంది. అయితే కింగ్ చార్లెస్‌కు నిర్ధారణ అయింది ప్రొస్టేట్ క్యాన్సర్ అని తెలుస్తోంది. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఆకాంక్షించారు. రాజు ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2022 సెప్టెంబర్ 8న రాజుగా చార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. 2023 మే 6న ఆయనకు పట్టాభిషేకం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join
ఇక సోమవారం నుంచి కింగ్ చార్లెస్‌కు(King Charles) సంబంధించిన అన్ని పబ్లిక్ ఫంక్షన్లను రద్దు చేయాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. అయితే, ఈ సమయంలో అతను పత్రాలపై సంతకం చేయడం, రాజభవనం లోపల చిన్న ప్రైవేట్ సమావేశాలను నిర్వహించడం వంటివి కొనసాగిస్తారు.కింగ్ చార్లెస్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని, త్వరలో తన రాజ బాధ్యతలను తిరిగి ప్రారంభిస్తారని రాజకుటుంబ ప్రతినిధి తెలిపారు. అయితే, ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
Also Read : VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు.. ఆన్‌లైన్‌లో పొందడం ఇలా..
దడపుట్టిస్తున్న ప్రొస్టేట్ క్యాన్సర్
- ప్రస్తుతం మనదేశంలోనూ ముఖ్యమైన ఆరోగ్య సమస్యల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి.
- ఇది మొత్తం క్యాన్సర్ కేసుల్లో 2.6%గా, దేశంలో 12వ అత్యంత సాధారణ రకం క్యాన్సర్‌గా ఉంది.
- సంవత్సరానికి సుమారు 34,500 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
- ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది వివిధ స్థాయిల తీవ్రతతో కూడిన సంక్లిష్ట వ్యాధి. దీనికి అన్ని సందర్భాల్లో తక్షణ చికిత్స అవసరం లేదు.
- ప్రొస్టేట్ క్యాన్సర్ సోకే రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్లని గుర్తించడం, ముందస్తుగా గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలకు సంబంధించి వారికి తగిన కౌన్సెలింగ్ అందించడాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు.
- స్క్రీనింగ్‌కి సరైన సమయం, ఫ్రీక్వెన్సీ లేదా బయాప్సీ ఇంటర్వెల్స్‌పై ప్రస్తుతం కచ్చితమైన సమాచారం లేదు. అయినా అత్యధిక రిస్క్ ఉన్న కేసులకు రెగ్యులర్ స్క్రీనింగ్ అవసరం.
- సాధారణంగా 75 సంవత్సరాలు దాటిన వారికి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించడం సురక్షితం కాదు.
- హై-రిస్క్ ఇండివిడ్యువల్స్ కోసం 40 ఏళ్ల వయసులో PSA స్క్రీనింగ్, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (DRE) నిర్వహిస్తారు. యాన్యువల్ ఫాలో-అప్‌లు అవసరం. యావరేజ్ రిస్క్ ఉన్న వారికి 45 నుంచి 75 సంవత్సరాల మధ్య స్క్రీనింగ్ జరగాలి.
- ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడానికి ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యం, కొమొర్బిడిటీస్, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, రోగి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకునే సమగ్ర విధానం అవసరం.
- అనవసరమైన చికిత్సలను తగ్గించడానికి, జీవన నాణ్యతను పెంచడానికి ఫిజికల్ ఎగ్జామినేషన్, మెడికల్ హిస్టరీ, టార్గెటెడ్ స్క్రీనింగ్ వంటి పద్ధతులను ఉపయోగించి రోగి ప్రత్యేక కారకాల ఆధారంగా ప్రతి కేసును విశ్లేషించడం చాలా అవసరం.