Viral Video : బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు విద్యార్థినుల గ్రూప్ వార్.. బెంగళూరులో రోడ్డుపై డిష్యుం డిష్యుం!!

వారంతా బెంగళూరులో ఒక ప్రముఖ పాఠశాల విద్యార్థినులు.. అవి కొట్లాట పోటీలేం కాదు.

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 09:00 PM IST

వారంతా బెంగళూరులో ఒక ప్రముఖ పాఠశాల విద్యార్థినులు.. అవి కొట్లాట పోటీలేం కాదు. రియల్ ఫైటింగ్. ఆ విద్యార్థినులు కోపంలో ఊగిపోయారు. ఒకరి జుట్టు ఇంకొకరు పీక్కుంటూ పరస్పరం విరుచుకుపడ్డారు. అరుపులు, కేకలు మిన్నంటాయి. కోపంలో విచక్షణ కోల్పోయిన ఓ విద్యార్థిని.. చివరకు తోటి విద్యార్థిని తల్లిని మెడపట్టి మెట్ల పై నుంచి తోసేసింది. మరో విద్యార్థిని కోపంతో బేస్ బాల్ బ్యాట్ చేతపట్టి తోటి విద్యార్థినులపై దాడికి సిద్ధమైంది. అయితే అదే పాఠశాల కు చెందిన కొందరు బాలురు వచ్చి వారించడంతో ఆమె శాంతించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

 

వివరాల్లోకి వెళితే.. ఈ డిష్యుం.. డిష్యుం బెంగళూరులోని ప్రముఖ బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినుల మధ్య మంగళవారం సాయంత్రం జరిగింది. విద్యార్థినులు రెండు గ్యాంగ్ లుగా విడిపోయి .. స్కూల్ కు సమీపంలోని విఠల్ మాల్యా రోడ్ వద్ద ఫైటింగ్ కు దిగారు. అటువైపు గా వెళ్తున్న వారు దీన్ని వీడియోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇద్దరు విద్యార్థినుల మధ్య బాయ్ ఫ్రెండ్ కు సంబంధించి జరిగిన గొడవే.. ఇంతలా రెండు గ్రూప్ లు ఏర్పడి కొట్టుకునేలా మారిందని పలువురు అంటున్నారు. ఈ ఘటన పై పాఠశాల యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ గొడవలో బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో చదువుతున్న కొందరు అమ్మాయిలకు తీవ్రగాయాలైనాయని తెలిసింది.