China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

China Hole To Earth : చైనా భూమికి భారీ రంధ్రం పెడుతోంది.. ఏకంగా 10 కిలోమీటర్ల లోతైన  బోర్‌ హోల్ ను తవ్వడం మొదలు పెట్టింది. షిన్ జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్‌లోని తారిమ్ బేసిన్‌లో ఈ సూపర్ డీప్ బోర్‌ హోల్ ను చైనా డ్రిల్  చేస్తోంది . ఇంతకీ ఎందుకో తెలుసా ?

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 08:05 PM IST

China Hole To Earth : చైనా భూమికి భారీ రంధ్రం పెడుతోంది..

ఏకంగా 10 కిలోమీటర్ల లోతైన  బోర్‌ హోల్ ను తవ్వడం మొదలు పెట్టింది.

షిన్ జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్‌లోని తారిమ్ బేసిన్‌లో ఈ సూపర్ డీప్ బోర్‌ హోల్ ను చైనా డ్రిల్  చేస్తోంది . ఇంతకీ ఎందుకో తెలుసా ?

తారిమ్ బేసిన్‌ అనేది సహజ వాయు నిల్వలకు పెట్టింది పేరు. ఇప్పుడు ఇంత లోతుగా(China Hole To Earth)  డ్రిల్ చేస్తున్నది కూడా ఆ ప్రాంతంలోని భూగర్భంలో దాగి ఉన్న విలువైన సహజ వాయు నిల్వల కోసమేనట.  డ్రిల్లింగ్ ప్రక్రియలో భాగంగా డ్రిల్ బిట్‌లు, డ్రిల్ పైపులతో కూడిన 2,000  టన్నుల భారీ పరికరాలు భూమిలోకి లోతుగా వెళ్లి.. 10 ఖండాంతర రాతి పొరలలోకి చొచ్చుకుపోతాయని నిపుణులు అంటున్నారు. 14 కోట్ల ఏళ్ళ కిందటి.. జురాసిక్ కాలం నాటి పురాతన రాతి నిక్షేపాలతో కూడిన క్రెటీషియస్ రాతి పొరలను చీల్చుకుంటూ ఈ డ్రిల్లింగ్ జరుగనుంది. తారిమ్ బేసిన్ అనేది తారిమ్ నదిని ఆనుకొని ఉన్న విశాలమైన ప్రాంతం. ఈ వివరాలను చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా ధృవీకరించింది. “అత్యంత లోతైన బోర్‌ హోల్ కోసం డ్రిల్లింగ్‌ దేశంలోని చమురు సంపన్న జిన్‌జియాంగ్ ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైంది”  అని జిన్హువా  వెల్లడించింది.

సన్నని స్టీల్ కేబుల్స్‌పై  పెద్ద ట్రక్కుతో డ్రైవింగ్ 

10 కిలోమీటర్ల లోతైన  బోర్‌ హోల్ డ్రిల్లింగ్ ప్రక్రియ చాలా కష్టంతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ‘‘డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ నిర్మాణ కష్టాన్ని రెండు సన్నని స్టీల్ కేబుల్స్‌పై డ్రైవింగ్ చేసే పెద్ద ట్రక్కుతో పోల్చవచ్చు’’ అని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌ కు చెందిన శాస్త్రవేత్త సన్ జిన్‌షెంగ్ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2021లో దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. లోతైన భూమి అన్వేషణలో మరింత పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఖనిజ, శక్తి వనరులను గుర్తించగలదని.. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి పర్యావరణ విపత్తుల ప్రమాదాలను అంచనా వేయడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

Also read : China: ఉత్తరాఖండ్‌లోని ఎల్‌ఏసీకి 11 కిలోమీటర్ల దూరంలో చైనా రక్షణ గ్రామాల నిర్మాణం

12.26 కిలోమీటర్ల లోతైన “కోలా” బోర్‌హోల్

భూమిపై అత్యంత లోతైన కృత్రిమ రంధ్రం రష్యాలోని  “కోలా” సూపర్‌డీప్ బోర్‌హోల్. దీని లోతు 12.26 కిలోమీటర్లు (40,230 అడుగులు). కోలాను తవ్వడం 1970 మే 24న స్టార్ట్ అయింది. 12.26 కిలోమీటర్ల లోతుకు చేరుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. 1992లో దీని డ్రిల్లింగ్ నిలిపివేశారు.  12.26 కిలోమీటర్ల లోతు దగ్గర భూగర్భంలో 180 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతను గుర్తించారు. ఆ లోతు వద్ద శాస్త్రవేత్తలు  ఊహించిన దాని కంటే డబుల్ లెవల్ లో టెంపరేచర్ ఉండటంతో డ్రిల్లింగ్ చేయడం స్టాప్ చేశారు.  సోవియట్ యూనియన్ హయాంలో “కోలా” సూపర్‌డీప్ బోర్‌హోల్ తవ్వారు. సోవియట్ యూనియన్  పతనమైన తర్వాత.. ఈ ప్రాజెక్టుకు నిధులు అందలేదు. ఫలితంగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్లేస్ నిర్మానుష్యంగా ఉంటుంది. సాహసోపేత టూరిస్టులు దీన్ని చూసేందుకు వెళ్తుంటారు. 

ఇది కూడా మొదలుపెట్టింది అమెరికానే

భూమి ఉల్లిపాయలా ఉంటే.. క్రస్ట్ అనేది భూమిపై ఉండే సన్నని చర్మం లాంటి పొర . ఇది 25 (40 కి.మీ) మైళ్ల మందం మాత్రమే ఉంటుంది.  దీనికి ఆవల 1,800 మైళ్ల లోతైన మాంటిల్ పొర  ఉంది. దాన్ని దాటి భూమి మధ్యలో కోర్ ఉంది. ఈ మాంటిల్ దాకా డ్రిల్లింగ్ చేయాలి.. అక్కడి దాకా ఉన్న వాతావరణ స్థితిగతులను తెలుసుకోవాలి.. ఖనిజ వనరుల గుట్టు బయటపెట్టాలి.. భూమి పుట్టుకతో ముడిపడిన సమాచారాన్ని తెలుసుకోవాలి అనే కుతూహలంతో భూమిలోకి సూపర్‌డీప్ బోర్‌హోల్స్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఈ దిశగా మొదటిసారి ప్రయత్నం చేసిందని అమెరికానే. 1950వ దశకం చివర్లో అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ  దీనికి సంబంధించిన ప్రణాళికను రూపొందించింది. దానికి “ప్రాజెక్ట్ మోహోల్” అని పేరు పెట్టారు.  అయితే 183 మీటర్లు తవ్వాక.. ఆ ప్రాజెక్టు పనులను ఆపేశారు. ఇది జరిగిన 20 ఏళ్ళ తర్వాత అమెరికాకు పోటీగా సోవియట్ యూనియన్ అత్యంత లోతైన  బోర్‌ హోల్ “కోలా”ను తవ్వడం మొదలుపెట్టింది.