Site icon HashtagU Telugu

Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

Dharmapuri Srinivas

Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ ఇక లేరు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఈవిషయాన్ని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా డి. శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో ఆయన మంచంపట్టారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స జరిగింది. ఈక్రమంలోనే ఇవాళ డీఎస్(Dharmapuri Srinivas) తుదిశ్వాస విడిచారు.

We’re now on WhatsApp. Click to Join

డి.శ్రీనివాస్ రాజకీయ జీవితం 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా సేవలు అందించారు. 2013 నుంచి 2015 శాసనమండలి సభ్యునిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తీరుపై డీఎస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఆయన 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహరాల సలహాదారుగా డీఎస్ పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టైంలోనే ఆయన చాలా విషయాల్లో టీఆర్ఎస్‌తో విభేదించారు. ఈనేపథ్యంలో డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

Also Read :Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. 88 ఏళ్ల రికార్డు బద్దలు

Also Read : T20 World Cup 2024 Final: హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా vs సౌతాఫ్రికా

డీఎస్ కెరీర్ గ్రాఫ్