BRS Party : `బీఆర్ఎస్` పై మోడీ నీడ‌

జాతీయ పార్టీని ఎందుకు కేసీఆర్ ప్ర‌క‌టించారు? ఆయ‌న ఎత్తుగ‌డ ఏంటి? అనేది టీఆర్ఎస్ పార్టీలోని నాయ‌కులే క్లియ‌ర్ గా చెప్ప‌లేక త‌డ‌బ‌డుతున్నారు

  • Written By:
  • Publish Date - October 6, 2022 / 02:39 PM IST

జాతీయ పార్టీని ఎందుకు కేసీఆర్ ప్ర‌క‌టించారు? ఆయ‌న ఎత్తుగ‌డ ఏంటి? అనేది టీఆర్ఎస్ పార్టీలోని నాయ‌కులే క్లియ‌ర్ గా చెప్ప‌లేక త‌డ‌బ‌డుతున్నారు. దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాలి? అందుకే జాతీయ పార్టీ అనేది కేసీఆర్ సూత్రీక‌ర‌ణ‌. కానీ, వాస్త‌వాలు వేరే విధంగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

దేశ చ‌రిత్ర‌లో బీజేపీ, కాంగ్రేత‌ర ప్ర‌భుత్వాలు మ‌నుగ‌డ సాధించిన కాలం చాలా స్వ‌ల్పం. ఎన్డీయే, యూపీఏ మాత్ర‌మే మూడు ద‌శాబ్దాలుగా క‌నిపిస్తోన్న దేశ రాజ‌కీయ ఈక్వేషన్. ప‌లుమార్లు ఎన్డీయే, యూపీయేత‌ర కూట‌మి, మూడో కూట‌మి ఇలా ప‌లు రకాలుగా ముందుకొచ్చిన‌ప్ప‌టికీ సాధ్య‌ప‌డ‌లేదు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ కూడా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ మీడియా ముందుకొచ్చారు. ఆనాటి నుంచి మౌనంగా ఉన్న కేసీఆర్ నాలుగేళ్ల త‌రువాత మళ్లీ భార‌త రాష్ట్ర స‌మితి అంటూ జాతీయ పార్టీ రూపంలో కేసీఆర్ `దేశ్ కీ నేత` అవ‌తారం ఎత్తారు.

వాస్త‌వంగా 2014 నుంచి బీజేపీతో క‌లిసిమెలిసి కేసీఆర్ న‌డిచారు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ఎన్డీయేకు మ‌ద్ధ‌తు ఇచ్చారు. ఏడాది కాలం నుంచి మాత్ర‌మే మోడీ స‌ర్కార్ తో కేసీఆర్ విభేదిస్తూ వ‌స్తున్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు ప‌రోక్షంగా టీఆర్ఎస్ మ‌ద్ధ‌తు ఇచ్చింది. సీఏఏ, 370 ర‌ద్దు త‌దిత‌ర వివాద‌స్ప‌ద అంశాల‌కు అండ‌గా నిలిచింది. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి కీల‌క నిర్ణ‌యాల‌కు జై కొట్టింది. ముచ్చింత‌ల్ రామానుజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ప్రోటోకాల్ ర‌గ‌డ మోడీ, కేసీఆర్ మ‌ధ్య వ‌చ్చింది. అప్ప‌టి నుంచి మూడునాలుగు సార్లు మోడీ తెలంగాణ‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసీఆర్ దూరంగా ఉంటున్నారు.

రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్బంగా టీఆర్ఎస్ బీజేపీని వ్య‌తిరేకించింది. రాష్ట్రంలోని వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో ల‌డాయి పెట్టుకుని ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు మోడీ సంగ‌తి చూస్తానంటూ కేసీఆర్ హూంక‌రించారు. అంద‌రూ బీజేపీ, టీఆర్ఎస్ కు చెడింద‌ని విశ్వ‌సించే వ‌ర‌కు రాజ‌కీయాన్ని న‌డిపారు. కానీ, ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ కేంద్రంగా భ‌వ‌నం నిర్మించుకునేందుకు స్వ‌ల్ప ధ‌ర‌కు భూమిని కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో టీఆర్ఎస్ నేత‌లు, ప్ర‌త్యేకించి క‌విత ఉన్నార‌ని బీజేపీ నేత‌లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఆమెకు ఈడీ నోటీసులు కూడా జారీ చేయ‌లేదు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో పాటు ప‌లు అవినీతి అంశాల‌పై సీబీఐ, ఈడీ, విజిలెన్స్ వద్ద కేసీఆర్ స‌ర్కార్ మీద ఫిర్యాదులు ఉన్నాయి. కానీ, కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ప్రాథ‌మిక విచార‌ణ చేయ‌డానికి కూడా ఆదేశించ‌లేదు. న్యాయ‌స్థానాల్లోనూ కేసీఆర్ స‌ర్కార్ మీద అవినీతి, అక్ర‌మాల మీద కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జైలుకు కేసీఆర్ ను పంపిస్తామ‌ని బ‌హిరంగ స‌భ‌ల్లో చెప్ప‌డం వ‌ర‌కు మాత్ర‌మే బీజేపీ అగ్ర‌నేత‌లు పరిమితం అవుతున్నారు. ఇదే విష‌యాన్ని గుర్తు చేస్తోన్న కాంగ్రెస్ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఉంద‌ని విశ్వ‌సిస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ ఎత్తుగ‌డ‌లో భాగంగా కేసీఆర్ కొత్త‌గా బీఆర్ఎస్ పార్టీని పెట్టార‌ని అనుమానిస్తోంది.

రెండు దశాబ్దాల టీఆర్‌ఎస్‌ 2001లో ప్ర‌త్యేక తెలంగాణ ఎజెండాతో స్థాపించబడింది. 2014 నాటికి ల‌క్ష్యాన్ని కేసీఆర్ చేరుకున్నారు. రెండుసార్లు సీఎం కావ‌డం ద్వారా ఆర్థికంగా బాగా ఎదిగారు. మూడోసారి కూడా సీఎం కావ‌డానికి బీఆర్ఎస్ స్థాప‌న అనివార్య‌మ‌ని భావించారు. జాతీయ రూపం సంత‌రించుకుంటే రాష్ట్ర ప్ర‌గ‌తిపై చ‌ర్చ‌ను డైవ‌ర్ట్ చేయొచ్చ‌నే ఆలోచ‌న‌తో ప్లాన్ చేశార‌ని బీజేపీ చెబుతోన్న వాద‌న‌.

బిజెపియేతర మరియు కాంగ్రెసేతర ప్రతిపక్షం కోసం కెసిఆర్ ఇటీవల హెచ్‌డి దేవెగౌడ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మరియు నితీష్ కుమార్‌లతో సహా పలువురు ప్రాంతీయ పార్టీ నాయకులు , ఆయా రాష్ట్రాల సీఎంల‌ను క‌లిశారు. వాస్త‌వంగా టీడీపీ, ఏఐఎంఐఎం వంటి ఇతర పార్టీలు జాతీయ స్థాయిలో పుంజుకోవడానికి ప్రయత్నించాయి. అయినప్పటికీ, జాతీయ రాజ‌కీయాల కోసం ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ కూడా పేరు మార్చుకోలేదు. కేసీఆర్ మాత్రం జాతీయ నాయకుడిగా ఇమేజ్‌ని విస్తరించుకోవడం కోసం బీఆర్ఎస్ కు బీజం వేశారు. కేంద్రంలోని విపక్షాల మ‌ధ్య ఉన్న శూన్యతను భర్తీ చేయాలన్నది కేసీఆర్ ఆశయంగా కేసీఆర్ వ‌ర్గీయులు చెబుతున్నారు.

వివిధ సంక్షేమ పథకాలతో మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల మద్దతును కూడ‌గ‌ట్టుకుని జాతీయ స్థాయిలో ప్రతిబింబించవచ్చని తెలంగాణ సీఎంవిశ్వసిస్తున్నారు. 2020-2021 రైతు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన ఢిల్లీ మరియు పంజా…