Double Decker E-Buses : హైదరాబాద్ కు మళ్ళీ డెక్కర్‌ ఈ – బస్సులు!

హైదరాబాద్ (Hyderabad) ఐకాన్‌గా నిలిచిన డబుల్‌ డెక్కర్‌ బస్సులు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్ ఐకాన్‌గా నిలిచిన డబుల్‌ డెక్కర్‌ (Double Decker) బస్సులు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నాటికి డబుల్‌ డెక్కర్‌ ఈ – బస్సులు (Double Decker e-buses) రోడ్డెక్కనున్నాయి. హెచ్‌ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో ఈ – బస్సుల కొనుగోలు ప్రక్రియను పూర్తి అయింది. ఈ నెలాఖరుకు మూడు ఈ-బస్సులు, ఫిబ్రవరి పది వరకు మరో మూడు మొత్తంగా ఆరు బస్సులు నగర రోడ్లపై పరుగులు తీయనున్నాయి. చార్మినార్‌ నుంచి గోల్కొండ కోట వరకు, జూపార్కు నుంచి హుస్సేన్‌సాగర్‌ తీరం వరకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉండడంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

నగరంలోని పర్యాటక స్థలాలను సందర్శించేందుకు వీలుగా మెరుగైన రవాణ సదుపాయం కల్పించడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఆరు డబుల్‌ డెక్కర్‌ ఈ-బస్సులు (E-Buses) కొనుగోలు చేయడానికి అశోక్‌ లేలాండ్‌ అనుబంధ సంస్థ అయిన స్విచ్‌ మొబిలిటీ ఆటోమోటివ్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. ముంబైకు చెందిన ఈ సంస్థనే బస్సుల మెయింటెనెన్స్‌ చూడనుంది. ఒక్కో బస్సుకు రూ.2 కోట్ల మేర ఆరు బస్సులకు రూ.12కోట్ల హెచ్‌ఎండీఏ వ్యయం చేస్తోంది.. వీటి నిర్వహణ హెచ్‌ఎండీఏ చూడనుంది. పర్యాటక ప్రాంతాల్లోనే ఈ బస్సులు తిరగనున్నాయి.

ఈ-బస్సులు పూర్తిగా ఎయిర్‌ కండీషన్‌తో ఉంటాయి. ముందు వైపు, వెనుక వైపు డోర్లు ఉండగా, ఆటోమెటిక్‌గా చేస్తాయి. బస్సు గ్రౌండ్‌ భాగం పూర్తిగా ఆర్టీసీ ఏసీ బస్సుల మాదిరిగానే ఉంటుంది. పైభాగంలో మొత్తం సాధారణ బస్సుల మాదిరిగానే సీటింగ్‌ ఉంటుంది. వెనుక తలుపు వద్ద నుంచి పై భాగంలోని సీటింగ్‌కు వెళ్లేందుకు మెట్ల మార్గం ఉంటుంది. అత్యవసర మార్గం కూడా ఉంటుంది. బస్సులో కూర్చోని బయటి అందాలను తిలకించేందుకు వీలుగా పై భాగంలో, కింది భాగంలో అత్యధికం గ్లాస్‌తోనే ఉంటుంది. విశాలంగా ఉండే బస్సులో ఇంటీరియర్‌ పర్యాటకులను ఆకట్టుకోనుంది. 65 మంది సీటింగ్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది.

Also Read:  Blood Group : హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో బ్లడ్ గ్రూప్ చూసి చెప్పేయొచ్చా..?