Site icon HashtagU Telugu

Courier Cheating : ‘కొరియర్’ పేరుతో కొల్లగొడతారు.. జాగ్రత్త సుమా !

Courier Cheating1

Courier Cheating1

Courier Cheating : సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త రకాల మోసాలకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో ‘కొరియర్’ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులను గుంజే పనిని వాళ్లు చేస్తున్నారు. ‘‘మీ పేరు.. మీ ఇంటి అడ్రస్‌తో డ్రగ్స్ కొరియర్, ఆయుధాల కొరియర్ దొరికింది. దాన్ని అధికారులు సీజ్ చేశారు. మీపై కేసు నమోదైంది. అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బయట పడాలంటే.. డబ్బులివ్వండి’’ అంటూ జనాలను సైబర్ క్రిమినల్స్ బెదిరిస్తున్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో విచారణకు హాజరైనా మీ జీవితం నాశనం అవుతుంది. దీని నుంచి బయటపడాలంటే మేం చెప్పినట్టు చేయండి’’ అని  సైబర్ కేటుగాళ్లు చెబుతున్నారు. ఇదంతా నిజమేనని నమ్మే వాళ్లు.. సైబర్ కేటుగాళ్ల అకౌంట్లకు వెంటనే పెద్దమొత్తంలో డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత సైబర్ కేటుగాళ్లు స్పందించడం లేదు. దీంతో తాము మోసపోయామని బాధితులు గుర్తిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇలాంటి చీటింగ్ వ్యవహారాలు చేసేముందు సైబర్ కేటుగాళ్లు ముందుగా కొందరిని టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. వారి ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామా వంటి వివరాలను సేకరిస్తున్నారు. అనంతరం టార్గెట్ చేసిన వారికి కాల్ చేసి.. ‘‘మీ ఇంటి అడ్రస్ నుంచి ఫారిన్‌కు పార్సిల్‌ చేసిన కొరియర్‌లో డ్రగ్స్, ఆయుధాలు ఉన్నాయి.పోలీసులు వాటిని పట్టుకొని కేసు నమోదు చేశారు’’ అని చెబుతారు. ఆ వెంటనే మరో ఫోన్ నంబరు నుంచి ఓ వ్యక్తి  వీడియో కాల్ చేసి.. తాను ముంబై సీబీఐ అధికారినని పరిచయం చేసుకుంటాడు. విచారణ  కోసం వెంటనే ముంబైకి రావాలంటాడు. లేదంటే తామే వచ్చి అరెస్టు చేస్తామంటాడు. తాను ఆ కొరియర్(Courier Cheating) పంపలేదని  బాధిత వ్యక్తి మొత్తుకున్నా అతగాడు వినిపించుకోడు.  ఆ వెంటనే ఇంకో వ్యక్తి కూడా ఫోన్ కాల్ చేస్తాడు. కేసు గురించి పూర్తిగా వివరిస్తాడు. కొరియర్‌లో ఇంటి అడ్రస్ , పేర్ల వివరాలను చదివి వినిపిస్తాడు. చివరకు బాధితుడు ఎంతో కొంత డబ్బులిస్తామని చెప్పేవరకు ఈ తతంగం నడుస్తుంది. ఈ మోసాన్ని బాధితుడు గుర్తించే వరకు అతడి నుంచి  సైబర్ కేటుగాళ్లు డబ్బులు గుంజుతూనే ఉంటారు.

Also Read :KCR Mark : కేసీఆర్ మార్క్‌ను చెరిపివేసే దిశగా కసరత్తు.. ఆ మార్పులే సంకేతం

హైదరాబాద్‌లో బాధితులు

హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ సంస్థలో పని చేస్తున్న ప్రొఫెసర్‌ రూ.45 లక్షలు చెల్లించారని ఇటీవల వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన మరో యువతి కూడా ఇలాగే రూ.60 లక్షలు పోగొట్టుకుంది. అయితే ఆ వెంటనే అనుమానం వచ్చి 1930కి ఫోన్‌ చేయగా.. ఆ డబ్బు నేరగాడి ఖాతాలో జమ కాకుండా సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆపారు. ఇలాంటి  మోసాలకు సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు దాదాపు 30 కాల్స్ వస్తున్నాయట. ఒకవేళ ఎవరైనా ఇలా మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

Also Read : Elon Musk : ట్రంప్ అధ్యక్షుడైతే ఎలాన్ మస్క్‌కు కీలక పదవి.. ఎందుకు ?