Site icon HashtagU Telugu

5 Percent Reservation : దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. సీఎం రేవంత్ ఆదేశాలు

District Reorganisation

District Reorganisation

5 Percent Reservation : దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు (5 Percent Reservation) అమలు కావాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఫైలును వెంటనే సిద్ధం చేసి పంపించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్‌లోనూ ట్రాన్స్ జెండర్లకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలన్నీ వారికి వర్తించేలా ప్రత్యేక విధానాన్ని తయారు చేయాలన్నారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలో ఉన్న 35వేల అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయో మెట్రిక్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఆడిటింగ్‌కు వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపర్చాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనాభాకు సరిపడే అంగన్వాడీ కేంద్రాలు లేనందున.. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో శానిటరీ నాప్కిన్స్ తయారీ చేయించాలని, అందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పాలని ఆదేశించారు. విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాలని సీఎం తెలిపారు.

Also Read : Half Day Schools : తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే..

రాష్ట్రంలోని 12,315 అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని..  వాటికి సొంత భవనాలను నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం తెలిపారు.  ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలను చేపట్టాలన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకే డిజైన్‌తో అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలన్నారు. మాతా, శిశు సంక్షేమం ఉట్టిపడే ఫొటోలు, ఆకర్షించే రంగులతో ఈ కేంద్రాలను తీర్చిదిద్దాలని చెప్పారు. అవసరమైతే ఆరేండ్ల లోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

Also Read :Madhavi Latha vs Owaisi : అసదుద్దీన్‌తో ఢీ.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరో తెలుసా ?

Exit mobile version