Your phone is infected with malware: లింకుల వల.. క్లిక్ చేస్తే.. బ్యాంక్ అకౌంట్లు వెలవెల!!

డిజిటల్ పేమెంట్లు రాకెట్ వేగంతో పెరిగాయి. ఇదే అదునుగా హ్యాకర్లు పేట్రేగుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ చేసే వినియోగదారులను మోసగించేందుకు కొత్త ట్రిక్స్ ప్రయోగిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 26, 2022 / 07:30 AM IST

డిజిటల్ పేమెంట్లు రాకెట్ వేగంతో పెరిగాయి. ఇదే అదునుగా హ్యాకర్లు పేట్రేగుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ చేసే వినియోగదారులను మోసగించేందుకు కొత్త ట్రిక్స్ ప్రయోగిస్తున్నారు. అమాయక వినియోగదారులు కొందరు హ్యాకర్ల వలలో చిక్కి.. తమ విలువైన సమాచారంతో పాటు నగదును కూడా కోల్పోతున్నారు.

అందుకే ఎప్పుడూ కూడా గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలను వెల్లడించరాదు. అపరిచితులు పంపే లింక్స్ ను క్లిక్ చేయకూడదు.
వాస్తవానికి ఏ బ్యాంకు అధికారి ఫోన్ కాల్ చేసి మీ వ్యక్తిగత వివరాలను అడగరు. కానీ, హ్యాకర్లు బ్యాంకు ప్రతినిధి అంటూ నమ్మబలికి మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలను తెలుసుకుని వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఫోన్లకు బ్యాంకు మెసేజ్ తరహాలో కొన్ని మెసేజ్‌లను వినియోగదారుల ఫోన్లకు పంపుతున్నారు. అది నిజంగా బ్యాంకు వాళ్లే పంపారనుకుని లింకులను క్లిక్ చేస్తున్నారు.

మీకు తెలియకుండానే..

మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతుల్లో వెళ్లిపోతాయి. మీ బ్యాంకు అకౌంట్లో నగదును మాయం చేసేస్తారు జాగ్రత్త.. ఇటీవల టెలికాం డిపార్ట్‌మెంట్‌ను హ్యాకర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారని సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు. ఈ మధ్యన ఫోన్లకు హ్యాకర్లకు కొత్త ట్రిక్ వాడుతున్నారట.. మీ ఫోన్ లో మాల్ వేర్ వైరస్ ఇన్ఫెక్ట్ అయిందని, వెంటనే క్లీన్ చేయకపోతే మీ డేటా దొంగలిస్తారంటూ మెసేజ్‌లను పంపుతున్నారు.

నిజమే అనుకొని..

మెసేజ్ లను చదివిన కొంతమంది వినియోగదారులు అది నిజమే అనుకొని లింకులను క్లిక్ చేస్తున్నారు. హ్యాకర్లు వెంటనే ఆయా యూజర్ల డేటాను దొంగలిస్తున్నారు. మీకు కూడా ఇలాంటి ఏదైనా మాల్ వేర్ అంటూ మీ ఫోన్ కు మెసేజ్ వస్తే.. వెంటనే ఈ వెబ్‌సైట్‌ (http://cyberswachhtakendra.gov.in) లింక్ అసలే క్లిక్ చేయొద్దు. భారత ప్రభుత్వం సైబర్ స్వచ్ఛతా ప్రాజెక్ట్ ప్రకారం.. హ్యాకర్ల బారినపడకుండా ఎలా ఉండాలో ఈ వెబ్‌సైట్ వివరణ ఇచ్చింది.

బీ అలర్ట్.. ఇది తెలుసుకోండి

మీరు ఇలాంటి మెసేజ్‌లు వచ్చినట్టుయితే.. ఆ లింకులను క్లిక్ చేయొద్దు. వెంటనే మీ ఫోన్లలో నుంచి ఆయా మెసేజ్ లను డిలీట్ చేసేయండి. స్కామర్‌లు మీ డివైజ్ హ్యాక్ చేయడానికి మీ వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికి ఉపయోగించే ట్రిక్ అది.. ముఖ్యంగా, టెలికాం విభాగం కొన్ని విషయాల గురించి యూజర్లను ఎప్పటికప్పుడూ అలర్ట్ చేస్తోంది. టెలికం కంపెనీలు ఎప్పుడు కూడా ఇలాంటి మెసేజ్‌లను పంపదు. మాల్వేర్‌కు సంబంధించిన మెసేజ్‌లను ఎవరూ అలా పంపరు. మీకు ఇలాంటి మెసేజ్ వచ్చినట్లయితే లింక్‌పై క్లిక్ చేయవద్దు.
ఈ సందర్భంలో (http://cyberswachhtakendra.gov.in )ఇది ఫేక్ లింక్ అని గమనించండి. వాస్తవానికి, ఈ లింక్‌పై క్లిక్ చేయడం వల్ల మీ డివైజ్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. తద్వారా స్కామర్‌లు మీ అకౌంట్ హ్యాక్ చేసేందుకు అనుమతించే అవకాశం కూడా ఉంది. సైబర్ స్వచ్ఛతా ప్రాజెక్ట్ అసలు లింక్ csk.gov.in.. మీకు వచ్చిన SMSలో ఈ లింక్ లేదని గుర్తించాలి.

లింకులు..ఫేక్ మెసేజ్ లు

– మెసేజ్ పంపినవారి పేరును చెక్ చేయండి.
– DoT మెసేజ్ పంపితే పంపినవారి పేరు DoT వంటి కీలక పదాలు ఉంటాయి.
– అలాంటి అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
– గుర్తుతెలియని వారు పంపిన లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
– ఇలాంటి మెసేజ్‌లను మరెవరికీ ఫార్వార్డ్ చేయవద్దు.
– మీకు ఇలాంటి మెసేజ్ వస్తే, వెంటనే దాన్ని డిలీట్ చేయండి.
– అలాంటి లింక్‌లపై క్లిక్ చేసే ముందు, URLని బాగా చదవండి. gov.in డొమైన్ చూసి మోసపోవద్దు.
– అన్ని gov.in డొమైన్ భారత ప్రభుత్వానికి చెందినవి కాదని గుర్తించుకోండి.. జర జాగ్రత్త..