Stunning Catch:త్రిపాఠి స్టన్నింగ్‌ క్యాచ్‌

ఐపీఎల్‌ 2022 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన క్యాచ్ పట్టి వహ్వా అనిపించాడు.

  • Written By:
  • Updated On - April 12, 2022 / 09:01 AM IST

ఐపీఎల్‌ 2022 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన క్యాచ్ పట్టి వహ్వా అనిపించాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమాన్ గిల్ కొట్టిన భారీ షాట్‌ను గాల్లో ఎగురుతూ ఒక్క చేత్తో క్యాచ్ అందుకొని అందర్నీ షాక్ కు గురిచేశాడు.. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్‌ వేసిన బంతిని శుభ్‌మాన్‌ గిల్‌ కవర్స్ మీదుగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రాహుల్‌ త్రిపాఠి డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

ఈ క్యాచ్ చూసి శుభమాన్ గిల్ తో పాటుగా మైదానంలో ఉన్న అభిమానులంతాలు ఒక్క సారిగా షాక్ అయ్యారు. రాహుల్ త్రిపాఠి క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది,. అలాగే ఈ, మ్యాచ్ 20వ ఓవర్‌లో అభినవ్ మనోహర్ బౌండరీ వద్ద ఇచ్చిన క్యాచ్‌ని రాహుల్ త్రిపాఠి డైవ్ చేసి మరీ పట్టేశాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్‌ టైటాన్స్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 50 పరుగులు,అభినవ్‌ మనోహార్‌ 35 పరుగులు, మ్యాథ్యు వేడ్‌ 19 పరుగులతో రాణించారు.ఇక సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ చెరో రెండు వికెట్లు సాధించగా జానెసన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఒక్కో వికెట్‌ సాధించారు. తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ విలియమ్సన్‌(57), అభిషేక్‌ శర్మ 42,పూరన్‌ 34 పరుగులతో రాణించారు.