Social Media Day : “సోషల్” వెలుగుల్.. ప్రతి ఒక్కరి చేతిలో మీడియా

Social Media Day : సోషల్ మీడియా యుగం ఇది.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జనం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఈరోజు వరల్డ్ సోషల్ మీడియా డే (Social Media Day) సందర్భంగా ఫోకస్..

  • Written By:
  • Publish Date - June 30, 2023 / 03:29 PM IST

Social Media Day : సోషల్ మీడియా యుగం ఇది.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జనం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్స్ ఒక రోజులో సగటున 144 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 448 కోట్ల మంది  ప్రజలు సోషల్ మీడియా యాప్స్ వినియోగిస్తున్నారు. ఒక్కో వినియోగదారుడు సగటున 6.6 వేర్వేరు సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నాడు. 2010 జూన్‌ 30న ‘మాషబుల్’ అనే సంస్థ ‘వరల్డ్ సోషల్‌ మీడియా డే ’ను ప్రారంభించింది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థపై సోషల్ మీడియాలు వేస్తున్న ముద్రను గుర్తించే ఉద్దేశంతో దీనిని మొదలుపెట్టింది. ఈరోజు వరల్డ్ సోషల్ మీడియా డే (Social Media Day) సందర్భంగా ఫోకస్..

సిక్స్‌ డిగ్రీస్‌..ఫ్రెండ్‌స్టర్.. తెలుసా?

1997లో తొలిసారిగా ‘సిక్స్‌ డిగ్రీస్‌’ అనే మొట్టమొదటి సోషల్ మీడియా స్టార్ట్ అయింది. ఆండ్రూ విన్రీచ్‌ అనే వ్యక్తి దానిని స్థాపించాడు. ఇందులో కోటి మంది యూజర్లు ఉండేవారు. దీని ప్రస్థానం 2001లో ముగిసిపోయింది. 2002లో ‘ఫ్రెండ్‌స్టర్’ అనే సోషల్ మీడియా వెబ్ సైట్ వచ్చింది . ఇది సురక్షితంగా కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడానికి అనుమతించిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్. దాంతో స్వల్పకాలంలోనే మిలియన్ల యూజర్లు వచ్చి చేరారు. అందులో మెజారిటీ వినియోగదారులు మన ఆసియా దేశాల నుంచే ఉండేవారు. 2003లో ‘లింక్డ్‌ ఇన్‌’ స్టార్ట్ అయింది.

Also read : Onion Prices: టమాటా బాటలోనే ఉల్లి.. ఉల్లి ధరలు కూడా పెరగబోతున్నాయా..?

ఫేస్‌బుక్‌ వర్సెస్ మై స్పేస్‌…

2004లో ‘మై స్పేస్‌’, ‘ఫేస్‌బుక్‌’ సోషల్ మీడియా యాప్స్ ప్రారంభమయ్యాయి. 2006 కల్లా ‘మై స్పేస్‌’ బాగా ఫేమస్ అయింది. మ్యూజిక్‌ను కూడా పోస్టు చేసే సౌలభ్యం ఉండటంతో దీనికి ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ టైం యూట్యూబ్‌ లో గడుపుతున్నారు. యూట్యూబ్‌  2005లో, ట్విటర్‌ 2006లో ప్రారంభమయ్యాయి. 2010లో ఇన్‌స్టాగ్రామ్‌ మొదలు కాగా.. అనతి కాలంలోనే అది ఫేస్‌బుక్‌కు పోటీనిచ్చే సంస్థగా ఎదిగింది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌ను 1 బిలియన్‌ డాలర్లకు ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఆ తరువాత ‘వాట్సప్‌’ను కూడా ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఫేస్‌బుక్‌కు 290 కోట్ల మంది, యూట్యూబ్‌కు 230 కోట్ల మంది , వాట్సప్‌కు 200 కోట్ల మంది , ఎఫ్‌ బీ మెసేంజర్‌కు 130 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లున్నారు.

‘టిక్‌ టాక్‌’ పై ఆరోపణలు

2016 చైనా సోషల్ మీడియా యాప్ ‘టిక్‌ టాక్‌’ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సులభంగా ఎడిటింగ్‌, నచ్చిన మ్యూజిక్‌తో పోస్టులు పెట్టే  ఫీచర్లతో రావడం వల్ల ఈ కంపెనీ తొందరగా వీక్షకుల అభిమానం పొందింది. భద్రతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంగా భారత్ సహా చాలా దేశాలు దీన్ని నిషేధించాయి. అయినప్పటికీ ఇతర దేశాల్లో టిక్‌టాక్‌ హవా కొనసాగుతూనే ఉంది. అయితే చాలా సోషల్ మీడియా యాప్స్ డేటా చౌర్యం, విద్వేషపూరిత ప్రసంగాలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, ఎన్నికల ఫలితాల తారుమారు, తప్పుడు సమాచార వ్యాప్తి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.