PAN Aadhar Link: పాన్ ఆధార్ లింకుకు గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?

ఆధార్ కార్డు అనేది ప్రతి దానికి నిత్యం అవసరమైనది.

  • Written By:
  • Updated On - March 28, 2023 / 05:40 PM IST

PAN Aadhar Link: ఆధార్ కార్డు అనేది ప్రతి దానికి నిత్యం అవసరమైనది. ఎక్కడికి వెళ్లిన ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు ఏ పనులైన త్వరగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్లకు, ఇతర వాటికి లింకు చేశారు. అయితే ఆ మధ్య పాన్ కార్డు కి కూడా ఆధార్ తో లింకింగ్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆ గడువులోగా లింకు చేయకపోతే పాన్ కార్డులు చెల్లవని తెలిపింది.

మామూలుగా పాన్ కార్డుతో చాలా అవసరం ఉంటుంది. బ్యాంకులలో అధిక డబ్బు తీసుకోవాలంటే పాన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పాన్ కార్డుకు ఆధార్ లింకు ఉండాలి అని లేదంటే కార్డు చెల్లదు అని తెలుస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్ కార్డు నెంబర్ ను పాన్ కార్డు 2023 మార్చి 31 లోగా లింకు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం గతంలో గడువు విధించింది.

ఇక ఏప్రిల్ ఒకటి నుంచి ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని కూడా హెచ్చరించింది. అయితే తాజాగా పాన్ కార్డ్ హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో మూడు నెలలు గడువు పెంచింది. కాబట్టి పాన్ ఆధార్ లింకు చేయని వారికి మరో మూడు నెలల గడువులో చేయించుకోవాలని ప్రకటించింది. పన్ను చెల్లింపు దారులకు ఇంకొంత సమయం ఇచ్చేందుకు గడువు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇక 2023 జూన్ 30లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే జులై 1 నుంచి పాన్ కార్డు చెల్లదు అని ప్రకటించింది. పాన్ కార్డ్ చెల్లకపోతే కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని.. ముఖ్యంగా అటువంటి పాన్ కార్డులకు సంబంధించి ఏవైనా రిఫండ్స్ వచ్చేది ఉంటే వాటిని చెల్లించరు అని తెలుస్తుంది. ఇక ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం టీడీఎస్, టీపీఎస్ వసూలు చేస్తుంది. ఇక పాన్ ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.1000 జరిమానా చెల్లించి చేయిస్తే 30 రోజుల్లో పాన్ కార్డు యాక్టివ్ అవుతుందని తెలిసింది.