Soil: మట్టిని కాంక్రీట్ గా మార్చే టెక్నాలజీ..ఎక్కడో తెలుసా?

  • Written By:
  • Updated On - June 14, 2022 / 08:30 PM IST

ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణాల్లో సిమెంటు, కంకర, కాంక్రీట్ ఇలాంటి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిలో అత్యధికంగా ఉపయోగించే వారిలో కాంక్రీట్ కూడా ఒకటి. వీటి తయారీ కారణంగా మనుషుల వల్ల ఉత్పన్నం అవుతున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలో దీని వాటా సుమారుగా 8 శాతం ఉంటోంది. ఈ కాంక్రీట్ లో కలిపే సిమెంట్ వల్ల అది అంత దృఢంగా, బలంగా ఉంటోంది. ఇకపోతే మామూలుగా ఉపయోగించే ఈ సిమెంట్ లలో కార్బన్డయాక్సైడ్ వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు పరిష్కారంగా మట్టిని కాంక్రీట్ గా మార్చే ఒక సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ఈ కొత్త రకం కాంక్రీటుతో స్విట్జర్లాండ్ లో ఒక అపార్ట్ మెంట్ కూడా నిర్మిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక వ్యక్తి ఈ భవనాలు నిర్మించే పద్ధతిని మార్చాలి అనుకొని, అందుకోసం ఒక కొత్తరకం కాంక్రీట్ ని కనుగొన్నారు. మట్టి,నీళ్లు కాస్త సీక్రెట్ పౌడర్ ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని క్లీన్ క్రీట్ అని పిలుస్తారు. ఇకపోతే మామూలు కాంక్రీట్ తో పోల్చుకుంటే ఈ క్లీన్ క్రీట్ గా పిలువబడే కాంక్రీట్ 90 శాతం పర్యావరణ రహితమైనది. క్లీన్ క్రీట్ గురించి టోగో ప్రాంత వాసులకు స్ఫూర్తిగా నిలిచింది.

ఇక్కడ చాలా ఇళ్లను మట్టితో నిర్మించారు. అందువల్ల ఆధునిక భవన నిర్మాణంలో కూడా మట్టిని భాగం చేయాలి అని గ్నాన్లీ లాండ్రో అనుకున్నారు. జురేజ్ యూటీహెచ్ యూనివర్సిటీలో పని చేసేటప్పుడు అతను ఈ క్లీన్ క్రీట్ ను కనిపెట్టారు. నిర్మాణ ప్రదేశంలో ఉన్న మట్టితోనే దానిని పునరుత్పాదన చేసే విధంగా కనుగొన్నారు. అయితే దృఢంగా ఉండడం కోసం సిమెంట్ కు బదులుగా మినరల్ సాల్ట్ కలిగిన ఒక సీక్రెట్ మిశ్రమాన్ని తయారు చేశారు గ్నాన్లీ. ఈ మిశ్రమం 48 గంటల తరువాత ఈ క్లీన్ క్రీట్ మిశ్రమం గట్టిపడుతుంది.