SSC: పదో సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్.. వివరాలివే

  • Written By:
  • Updated On - May 2, 2024 / 10:58 PM IST

SSC: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ డైరెక్టరేట్‌ ఆఫ్ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ విడుదల చేసింది. జూన్‌ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ విడుదల చేసింది. జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజుల చెల్లింపుకు మే 16వ తేదీ వరకు విద్యార్ధులు ఫీజు చెల్లించవచ్చు.

విద్యార్ధుల పరీక్ష ఫీజులను హెడ్‌మాస్టర్లు మే 17వ తేదీలోగా ట్రెజరీ కార్యాలయాల్లో జమ చేయాల్సి ఉంటుంది. మే 20వ తేదీ లోపు నామినల్ రోల్స్‌ను ప్రధానోపాధ్యాయులు డిఈఓ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. మే 22లోగా డిఈఓలు నామినల్ రోల్స్‌ను పరీక్షల డైరెక్టరేట్‌కు పంపించాల్సి ఉంటుంది.రూ.50 ఆలస్య రుసముతో సప్లిమెంటరీ పరీక్షల ఫీజును సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందు కూడా విద్యార్ధులు ప్రధానోపాధ్యాయులకు చెల్లించవచ్చు. అలా ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజుల్ని చెల్లించిన వారి నామినల్ రోల్స్ జూన్ 14వ తేదీన ప్రధానోపాధ్యాయులు డిఈఓ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో పరీక్షలకు హాజరైన విద్యార్ధుల నామినల్ రోల్స్‌ను డిఈఓలు జూన్‌18లోగా పంపాల్సి ఉంటుంది.