Andhra-Odisha Border: రేషన్‌.. పరేషాన్‌..! అర్ధాకలితో అడవిబిడ్డలు!

వాళ్లంతా అడవి బిడ్డలు.. రెక్కాడితే కానీ డొక్కాడదు. అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు.

  • Written By:
  • Updated On - June 10, 2022 / 12:14 PM IST

వాళ్లంతా అడవి బిడ్డలు.. రెక్కాడితే కానీ డొక్కాడదు. అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఒక్క పూట కూడా పని దొరక్కపోతే కుటుంబమంతా పస్తులుండాల్సిన పరిస్థితులు. ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ఇప్పటికే ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న అడవిబిడ్డలకు ప్రభుత్వం అందించే రేషన్ అందడం లేదు. కేవలం రోడ్డు సౌకర్యం లేదనే సాకుతో రేషన్ సరఫరా చేయడం లేదు. దీంతో అడవిబిడ్డలు అన్నామో రామచంద్రా అంటూ ఆకలితో అలమటిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) రేషన్‌ను లబ్ధిదారుల ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తున్నప్పటికీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (AOB)లోని కొన్ని కొండలపై ఉన్న గ్రామాలకు రహదారి కనెక్టివిటీ లేకపోవడం వల్ల రేషన్ పొందడం లేదు. పార్వతీపురంలోని సాలూరు మండలంలోని మూడు కొండలపైన గ్రామాల్లోని 1,050 కుటుంబాలకు గత ఐదు నెలలుగా రేషన్‌ అందడం లేదు. ముందుగా గ్రామాలకు రేషన్‌ సరఫరా చేసేందుకు ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా నిధుల కొరత కారణంగా సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. కొండపైన వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు రేషన్ పొందేందుకు మైదాన ప్రాంతంలోని పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా సాలూరు మండలంలోని కొదమ, చింతమల, సిరివర గ్రామాల ప్రజలు రేషన్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వీళ్లంతా AP వాసులు అయినప్పటికీ, సాలూరు నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల ప్రధాన కార్యాలయం నుంచి రహదారి కనెక్టివిటీ లేదు. అయితే, ఈ గ్రామాలకు ఒడిశా వైపు నుండి నారాయణపట్నం మీదుగా రోడ్డు కనెక్టివిటీ ఉంది. అది సాలూరు నుండి 130 కిమీ కంటే ఎక్కువ దూరంలో ఉంది. పథకం ప్రారంభించిన నాటి నుంచి ప్రతి నెలా రేషన్ పంపేందుకు ప్రత్యేక వాహనాలను అద్దెకు తీసుకుని కొండపైన గ్రామాల్లో పథకాన్ని అమలు చేసేందుకు ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐటీడీఏ పీఓ ఆర్‌ కురంనాథ్‌ హామీ మేరకు కొండపైన ఉన్న గ్రామాల్లో రేషన్‌ పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలతోపాటు స్థానిక రెవెన్యూ అధికారులు వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. అయితే తొమ్మిది నెలలుగా రూ.4 లక్షల బిల్లు క్లియర్ చేయడంలో ఐటీడీఏ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఫిబ్రవరిలో రేషన్ డోర్ డెలివరీ నిలిచిపోయింది.

రెండు రాష్ట్రాల బార్డర్ లోని కొదమ గ్రామానికి చెందిన మాలతి దొర అనే లబ్ధిదారు మాట్లాడుతూ.. “మూడు గ్రామాల్లో 1,043 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. అంతకుముందు అధికారులు ప్రతినెలా ప్రత్యేక వాహనాల్లో ఒడిశా మార్గం ద్వారా రేషన్ పంపేవారు. అయితే ఫిబ్రవరి నుంచి రేషన్ పంపడం మానేశారు. గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేనందున చాలా మంది ప్రభుత్వ రేషన్‌పై ఆధారపడతారు. గ్రామానికి రేషన్ పంపాలని ఐటీడీఏతోపాటు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి ప్రత్యేక వాహనాల్లో కొండపైనున్న గ్రామాలకు ఫిబ్రవరి వరకు రేషన్‌ పంపాం. ప్రభుత్వం 4 లక్షలు క్లియర్ చేయాల్సి ఉంది. మేం సమస్యను మా ఉన్నతాధికారులకు తెలియజేశాం. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని ఇన్‌చార్జి తహసీల్దాహర్ చంద్రశేఖర్ తెలిపారు.