Bigg Boss 6: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ అవుట్?

బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. మరి ముఖ్యంగా తొమ్మిదవ

  • Written By:
  • Updated On - November 12, 2022 / 03:07 PM IST

బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. మరి ముఖ్యంగా తొమ్మిదవ వారం ఎలిమినేషన్స్ విషయంలో ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాడు బిగ్ బాస్. టాప్ ఫైవ్ లో ఉంటుంది అనుకున్న గీతూ గతవారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇక పదో వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ పదోవారం డబుల్ ఎలిమినేషన్ చేయబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రేక్షకులు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ల అంచనాలను తలకిందులు చేస్తూ ఈవారం డబ్బులు ఎలిమినేషన్స్ తో షాక్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్స్ విషయంలో లీక్ లు బయటకు వచ్చాయి. కాగా ఈవారం మొత్తం తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. కీర్తి, ఫైమా, వాసంతి, బాలాదిత్య, మెరీనా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయ లు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో నుంచి బాలాదిత్య, మెరీనా బిగ్ బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. సాధారణంగా బిగ్బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చే ముందు భారీ పాపులారీటీతో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అవడం లేదంటే నెగెటివిటీని మూట కట్టుకొని బయటకు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. గతవారం ఎలిమినేట్ అయిన గీతూ బోలెడంత నెగిటివిటిని మూట గట్టుకొని బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా పదో వారం ఎలిమినేషన్ అయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్న మెరీనా, బాలాదిత్యా ఎలా అయితే హౌస్ లోకి వెళ్లారో అదేవిధంగా అదే ఇమేజ్ తో బయటికి వచ్చారు. ఒక్క సిగరెట్ల విషయంలో బాలాదిత్య పై కాస్త నెగిటివిటీ వచ్చినా అదే అతనికి ప్లస్ కూడా అయ్యింది. ఇక మెరీనాకి అయితే క్లీన్ ఇమేజ్‌తో బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లింది. అదే క్లీన్ ఇమేజ్‌తో బయటకు వచ్చేసింది. పనికి తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆదివారం అనగా పదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగిందని సమాచారం.