Hyderabad: ఐఐటీలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు నేటి యువత. తల్లి దండ్రుల కోరికను తీర్చలేకపోతున్నానే బాధతో ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ కి పాల్పడుతున్నారు

Hyderabad: పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు నేటి యువత. తల్లి దండ్రుల కోరికను తీర్చలేకపోతున్నానే బాధతో ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ కి పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ యువతీ ఐఐఐటీలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ లో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో 16 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు వరంగల్ జిల్లా వాసి కాగా ఆమె జూలై 18న ఆత్మహత్యకు యత్నించింది.దీంతో ఆమెను నిమ్స్ లో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. సదరు యువతి ఐఐఐటీ పరీక్షలో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాలు కోరిక మేరకు ఆమె మరణానంతరం కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు ఆమె కుటుంబ సభ్యులు జీవందన్ ట్రస్ట్‌కు దానం చేశారు.

Also Read: MLC Kavitha: ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం