Earthquake Hits Afghanistan: ఆఫ్గనిస్థాన్‌లో మ‌రోసారి భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్‌పై 4.2 తీవ్ర‌త‌గా న‌మోదు..!

ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం (Earthquake Hits Afghanistan) సంభవించింది. నేడు తెల్లవారుజామున 4.07 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Earthquake

Earthquake

Earthquake Hits Afghanistan: ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం (Earthquake Hits Afghanistan) సంభవించింది. నేడు తెల్లవారుజామున 4.07 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైందని పేర్కొంది. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని స‌మాచారం.

బుధవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం సంభవించినప్పుడు ప్రజలు ఇళ్లలో నిద్రిస్తున్నారు. మెలకువగా ఉన్న కొందరు వ్యక్తులు కంపనాన్ని అనుభవించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం లోతు 10 కి.మీ. NCS తన సమాచారాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అందులో “ఫిబ్రవరి 21 ఉదయం 4:07 నిమిషాల 56 సెకన్లకు ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది” అని పేర్కొంది.

సంక్షోభంలో చిక్కుకున్న దేశంలో 24 గంటల్లో సంభవించిన రెండో భూకంపం ఇది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో సోమవారం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు ఆదివారం సాయంత్రం కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Also Read: Government In Pakistan: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగ‌మం..!

ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం విధ్వంసం సృష్టించింది

గత ఏడాది అక్టోబర్ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో సంభవించిన ఘోరమైన భూకంపం వల్ల 4,000 మందికి పైగా మరణించారని, వేలాది నివాస గృహాలు ధ్వంసమయ్యాయని మ‌న‌కు తెలిసిందే. హెరాత్, పరిసర ప్రాంతాలు 6.3 తీవ్రతతో భూకంపం, దాని శక్తివంతమైన అనంతర ప్రకంపనలకు వణుకుతున్నాయి.

We’re now on WhatsApp : Click to Join

భూకంపాలు ఎందుకు వ‌స్తాయి..?

భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది.

  Last Updated: 21 Feb 2024, 07:33 AM IST