Site icon HashtagU Telugu

Womens Day : ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’.. చరిత్ర, 2024 థీమ్ వివరాలివీ

Womens Day

Womens Day

Womens Day : మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు ధీటుగా వనితలు తమ సత్తాను చాటుకుంటున్నారు. మహిళలకు వెరీవెరీ స్పెషల్‌గా నిలిచే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ (Womens Day) ఈనెల 8న జరగనుంది. ఈఏడాది ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’  థీమ్ ఏమిటో తెలుసా ?  ‘‘ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్’’!! విభిన్న నేపథ్యాలతో, వివిధ రంగాలలో రాణిస్తున్న  మహిళామణులను గౌరవించడం, ప్రోత్సహించడమే ఈ థీమ్ లక్ష్యం. అలాంటి మహిళల విజయాలను మరింత మంది వనితలకు తెలియజేయడం కూడా ఈ థీమ్‌ లక్ష్యంలో భాగమే. రాజకీయాలు, వ్యాపారం, సేవాభావం వంటి వాటిపై మహిళల అభిప్రాయాలను తెలుసుకోవడం కూడా ఇందులో చాలా కీలకం. ప్రపంచంలో స్త్రీ, పురుష సమానత్వ భావజాలాన్ని వ్యాపింపజేయడం సైతం ఈసందర్భంగా అందరి బాధ్యత. మహిళల సాధికారత కోసం మద్దతునిస్తున్న స్వచ్ఛంద సేవా  సంస్థలపై చర్చించడం అనేది ఈవారంలో చాలా ముఖ్యం.

We’re now on WhatsApp. Click to Join

చారిత్రక విశేషాలివీ.. 

Also Read : HGCC : ఇక ‘హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌’.. ఎందుకు ?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అధికంగా ఊదారంగును ధరిస్తారు. ఊదారంగు (పర్పుల్), ఆకుపచ్చ, తెలుపు.. మహిళా దినోత్సవం రంగులని ఇంటర్నేషనల్ వుమెన్స్ డే వెబ్‌సైట్ చెబుతోంది. ‘‘ఊదారంగు న్యాయానికి, గౌరవానికి ప్రతీక. ఆకుపచ్చ ఆశాదృక్పథాన్ని సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతకు ప్రతిరూపం (ఇది వివాదాస్పద భావన అయినప్పటికీ). ఈ రంగులు 1908లో బ్రిటన్‌లోని వుమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ (WSPU)లో పుట్టుకొచ్చాయని’’ అని చెబుతుంటారు.

Also Read : 335 PA Posts : డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్​ఓ‌లో 335 పీఏ పోస్టులు