Womens Day 2022 : లింగ సమానత్వం సాధించడమే కీలకం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖున జరుపుకుంటారు.

  • Written By:
  • Updated On - March 8, 2022 / 12:04 PM IST

Womens Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖున జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8, మంగళవారం జరుపుకోనున్నారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ఇలా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటుగా…వారి దక్కాల్సిన హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఈ వేడుకను జరుపుకుంటారు. అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకోవడం షురూ చేసి వందేళ్లు దాటాయి. అయినా కూడా ఇప్పటికీ మహిళలు ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం థీమ్ హిస్టరీ గురించి తెలసుకుందాం.

ఈ సంవత్సరం వుమెన్స్ డే థీమ్…సుస్థిరమైన రేపటి కోసం…ఈరోజు లింగ సమానత్వం…చెప్పాలంటే ఈ ఏడాది థీమ్ రేపటి మహిళలు. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం చాలా కీలకమైంది. 21 శతాబ్దంలో అతిపెద్ద సవాళ్లలో ముఖ్యమైనవి పర్యావరణం, విపత్తు ప్రమాదాల తగ్గింపు వంటివి ఉన్నాయి. ఇప్పటికీ లింగ సమానత్వం లేదు…మహిళలకు స్థిరమైన భవిష్యత్తు, సమాన భవిష్యత్తు మన పరిధికి మించినదని UN వుమెన్స్ వైబ్ సైట్ లో పేర్కొంది. ఈ ఏడాది వాతావరణ మార్పుల గురించి…వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ..నాయకత్వం వహిస్తున్న మహిళలు, బాలికను ఐడబ్య్లూ డి గౌరవించనున్నట్లు వెల్లడించింది.

ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర గురించి తెలుసుకుంటే…1900వ దశకం నుంచి నిర్వహిస్తున్నారు. 1908లో 15వందల మంది మహిళలు తమకు పనిగంటలు, మెరుగైన వేతనం, ఓటు హక్కును డిమాండ్ చేశారు. న్యూయార్క్ నగరంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909లో మహిళల డిమాండ్ లను గుర్తించి…జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్ లో నిర్వహించారు. తర్వాత 1911లో మార్చి 19న ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్టర్లాండ్ లో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఫస్ట్ వరల్డ్ వార్ సందర్బంగా శాంతికోసం ప్రచారం చేస్తూ…రష్యా మహిళలు తమ తొలి ఉమెన్స్ డే ను ఫిబ్రవరి 23 చివరి ఆదివారం జరుపుకున్నారు. తర్వాత ఉమెన్స్ డే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మార్చి 8న నిర్వహించాలని అంగీకరించార. అప్పటినుంచి అంతర్జాతీయ ఉమెన్స్ డే మార్చి 8న సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక యుఎన్ తొలి వార్షిక థీమ్ ను 1996లో గతాన్ని జరుపుకోవడం, భవిష్యత్తు కోసం ఏర్పరుచుకున్న ప్రణాళిక గా ప్రకటించింది.

ఊదా, ఆకుపచ్చ, తెలుపు , వరల్డ్ ఉమెన్స్ డేను సూచిస్తాయి. ఉదా రంగు న్యాయం, గౌరవాన్ని సూచిస్తే..ఆకపచ్చ ఆశను సూచిస్తుంది. తెలుపు స్వచ్చతను సూచిస్తుంది.