SpaceX: ఎలాన్ మస్క్ “స్పేస్ ఎక్స్” హిస్టరీ

ఎలాన్ మస్క్ కు చెందిన "స్పేస్ ఎక్స్" కంపెనీ.. ఎన్నో రాకెట్ ప్రయోగాలు.. ఎన్నో శాటిలైట్ ప్రయోగాలు చేసింది. వాటిలో ఎన్నో ఫెయిల్ అయ్యాయి. ఎన్నో సక్సెస్ అయ్యాయి

* ఏప్రిల్ 20 @ 16వేల కోట్లు బూడిద..
* స్పేస్ ఎక్స్ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా?
* ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ హిస్టరీ

SpaceX: ఎలాన్ మస్క్ కు చెందిన “స్పేస్ ఎక్స్” కంపెనీ.. ఎన్నో రాకెట్ ప్రయోగాలు.. ఎన్నో శాటిలైట్ ప్రయోగాలు చేసింది. వాటిలో ఎన్నో ఫెయిల్ అయ్యాయి. ఎన్నో సక్సెస్ అయ్యాయి. ఒక్క ఫెయిల్ అయిన ప్రయోగం వ్యాల్యూ వేల కోట్లు.

ఉదాహరణకు 2023 ఏప్రిల్ 20వ తేదీన స్పేస్ ఎక్స్ నిర్వహించిన “స్టార్ షిప్” రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయింది. ఈ రాకెట్ ప్రయోగించిన 3 నిమిషాలకే గాల్లో పేలిపోయింది. “స్టార్ షిప్” రాకెట్ నుంచి బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ లు నిర్దిష్ట సమయంలో విడిపోవాలి. కానీ అలా జరగలేదు. దీనివల్ల స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది. రాకెట్ లోని 33 రాప్తార్ ఇంజిన్లలో 5 పనిచేయకపోవడం కూడా ఈ ప్రయోగం ఫెయిల్యూర్ కు కారణం. ఏదిఏమైనప్పటికీ ఈ ప్రయోగం ఫెయిల్ కావడం వల్ల స్పేస్ ఎక్స్ కు రూ.16వేల కోట్లకు పైనే నష్టం వాటిల్లింది. ఇది కేవలం స్టార్ షిప్ రాకెట్ ధర మాత్రమే. ఇక ప్రయోగం నిర్వహణ ధర, సాంకేతిక నిపుణుల ఖర్చులు, సాంకేతిక వనరుల వ్యయం ఎక్స్ ట్రా..

స్పేస్ ఎక్స్ చరిత్రను పరిశీలిస్తే.. అది 2002 మార్చిలో షురూ అయింది. ప్రస్తుతం ఇందులో 47.4 శాతం వాటా ఎలాన్ మస్క్ కు ఉంది. 12000 మంది నిపుణులు, సిబ్బంది ఇందులో పని చేస్తున్నారు.  ప్రస్తుతం స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ విలువ రూ.11.23 లక్షల కోట్లు. స్పేస్ ఎక్స్ ట్రాక్ రికార్డ్ ను పరిశీలిస్తే.. అది పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడేలా నాసా హెల్ప్ చేసింది. ఇందుకోసం అది స్పేస్ ఎక్స్ కు భారీ కాంట్రాక్టులు కేటాయించింది.

■ 2 వరుస ఫెయిల్యూర్స్ .. 1 సక్సెస్

2007 మార్చి, 2008 ఆగస్టులో
ఫాల్కన్ 1 రాకెట్ ప్రయోగాన్ని స్పేస్‌ ఎక్స్ నిర్వహించింది. ఇంధనం లీక్ మరియు మంటల కారణంగా అవి ఫెయిల్ అయ్యాయి.   2008 సెప్టెంబరులో SpaceX ద్రవ-ఇంధన రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

■ స్పేస్ ఎక్స్ ను నిలబెట్టిన నాసా కాంట్రాక్ట్

★ఫాల్కన్ 1 రాకెట్ ప్రయోగాల నష్టాన్ని పూడ్చుకునేలా స్పేస్ ఎక్స్ కు 2008 డిసెంబరు లో నాసా హెల్ప్ చేసింది. రూ.8200 కోట్ల విలువైన NASA ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సర్వీసింగ్ కాంట్రాక్ట్‌ను స్పేస్ ఎక్స్ కు అప్పగించింది. దీంతో SpaceX ఆర్థిక స్థితి మెరుగుపడటం ప్రారంభించింది.

★ ఇదే టైంలో తన దగ్గర నిధుల్లో కొంత మొత్తంతో టెస్లా కంపెనీని మస్క్ మొదలుపెట్టాడు.

★ ఫాల్కన్ 9 రాకెట్ల అభివృద్ధికి కూడా నాసా నుంచి స్పేస్ ఎక్స్ కు ఫండింగ్ అందింది. ఆ సమయానికి   SpaceX నికర విలువ రూ.10వేల కోట్లు మాత్రమే.

★ 2012 మే నెలలో స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క వాణిజ్య అంతరిక్ష నౌక ప్రయోగం సక్సెస్ అయింది. దీని తర్వాత SpaceX యొక్క ఈక్విటీ వాల్యుయేషన్ దాదాపు రెండింతలు పెరిగి రూ.19 వేల కోట్లకు చేరుకుంది.

★  2014లో స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కోసం 20 సంస్థలు
పోటీపడ్డాయి. వాటిలో SpaceX 9 గెలుచుకుంది.

★ 2015 ప్రారంభంలో SpaceX కంపెనీలో 8.3% వాటాను ఫిడిలిటీ మరియు Google రూ.8వేల కోట్లకు కొనుగోలు చేశాయి. దీంతో ఆ ఏడాది నాటికి SpaceX నికర విలువ రూ.98వేల కోట్లకు పెరిగింది.

★SpaceX 2017 జూలైలో $350 మిలియన్లు సంపాదించింది. దీంతో కంపెనీ విలువ రూ.1.72 లక్షల కోట్లకు చేరింది.

★ 2018 ప్రారంభంలో స్పేస్ ఎక్స్ కంపెనీ పెద్దఎత్తున లాంచ్‌లను చేసింది.

★2020 చివరిలో SpaceX రూ.15వేల కోట్లు విలువైన నిధులను సేకరించింది. దీంతో కంపెనీ విలువ రూ.3.77 లక్షల కోట్లకు ఎగిసింది.

★స్పేస్ ఎక్స్ కంపెనీ 2021లో 99 మంది పెట్టుబడిదారుల నుండి మరో $1.61 బిలియన్లను సేకరించింది. దీంతో కంపెనీ
విలువ సుమారు రూ.6 లక్షల కోట్లకు చేరింది. స్పేస్‌ఎక్స్ కంపెనీ ఈక్విటీ ఫైనాన్సింగ్‌ ద్వారా మరో రూ.49 వేల కోట్లకుపైగా సేకరించింది. దీంతో దాని నికర విలువ రూ.8.20 లక్షల కోట్లకు పెరిగింది.

★2021లోనే ఎలాన్ మస్క్ తనకు చెందిన మరో కంపెనీ స్టార్‌లింక్ కోసం నెట్‌వర్కింగ్ మరియు ఆన్ గ్రౌండ్ కంప్యూటర్ సేవలను అందించడానికి “మైక్రోసాఫ్ట్ అజూర్‌”తో ఒప్పందం కుదుర్చుకుంది.

★ SpaceX 2022 జూలైలో
32 రౌండ్లలో 80 మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.82వేల కోట్ల నిధులను సేకరించింది.

★ గత మూడేళ్లలో స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ విలువ నాలుగు రెట్లు పెరిగింది. దాని మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.11.48 లక్షల కోట్లకు జంప్ అయింది. దీంతో SpaceX అనేది లాక్‌హీడ్ మార్టిన్ , బోయింగ్ వంటి పరిశ్రమ దిగ్గజాలను దాటేసింది.

★ నాసా, స్పేస్ ఎక్స్ బిగ్ డీల్

2025లో చంద్రుడిపైకి వ్యోమ గాములను పంపే ప్రాజెక్టుకు కూడా స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ రాకెట్ ను వినియోగించాలని నాసా డిసైడ్ చేసింది. దీనికి సంబంధించిన కాంట్రాక్టును స్పేస్ ఎక్స్ కు నాసా ఇచ్చింది. 2021 ఏప్రిల్ లోనే రూ.23వేల కోట్లను స్పేస్ ఎక్స్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చింది.

Read More: Elon Musk: స్నైల్‌ బ్రూక్: మస్క్ సొంతంగా నిర్మించనున్న మహా నగరం విశేషాలు..!