Site icon HashtagU Telugu

Gaganyaan Mission : ఇవాళ ‘గగన్‌యాన్’ టెస్ట్ ఫ్లైట్.. ఏమిటి ? ఎలా ?

Gaganyaan Mission

Gaganyaan Mission

Gaganyaan Mission : ఇవాళ  గగన్‌యాన్ మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్ జరగబోతోంది. వాస్తవానికి ఇది 8 గంటలకే జరగాల్సి ఉంది. కానీ ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1)  రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కౌంట్ డౌన్‌ టైంను పొడిగించారు. ఈ ప్రయోగంపై స్వయంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శ్రీహరికోటలో శాస్త్రవేత్తలతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు భారత్‌ చేపడుతున్న గగన్‌యాన్‌లో తొలి అడుగు ఇదే. ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) అనే ఈ పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ ఎంతమేరకు సమర్ధంగా ఉంది అనేది టెస్ట్ చేస్తున్నారు. గగన్‌యాన్‌లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేముందు ఇస్రో దాదాపు 20 విభిన్న పరీక్షలు నిర్వహించనుంది. వాటిలో మొదటిదే..‘‘ టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌(టీవీ-డీ1)’.  ఇందులో భాగంగా క్రూ మాడ్యూల్‌ను టీవీ-డీ1 రాకెట్‌తో ప్రయోగించనున్నారు.ఆ తర్వాత బంగాళాఖాతంలో పారాచూట్ల సాయంతో ల్యాండయ్యే క్రూ మాడ్యూల్‌ను తిరిగి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తారు. ఈ ప్రయోగం మొత్తం సుమారు పది నిమిషాల్లో పూర్తవుతుంది.

ప్రయోగం ఇలా జరుగుతుంది..

We’re now on WhatsApp. Click to Join.

గగన్ యాన్ ఎందుకు ?

  • మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో చేపడుతున్న కార్యక్రమమే గగన్‌యాన్.
  • 2025 మార్చినాటికి ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో మూడు రోజులు ఉంచి, సురక్షితంగా భూమి మీదికి తిరిగి తీసుకురావడమే మానవసహిత గగన్ యాన్ ప్రయోగం అంతిమ లక్ష్యం.
  • ఈ మిషన్‌లో భాగంగా 20 రకాల విభిన్నమైన పరీక్షలు, 3 మానవ రహిత ప్రయోగాలు కూడా చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
  • ఈ 20 రకాల పరీక్షల్లో భాగంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్‌ ప్రయోగాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు.
  • ఈ ప్రయోగాలన్నీ విజయవంతంగా పూర్తయితే 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు.

Also Read: Delta Force : ఇజ్రాయెల్‌లో అమెరికా ‘డెల్టా ఫోర్స్’ .. ఏం చేయబోతోంది ?