Site icon HashtagU Telugu

Biparjoy-100 Lions : బీచ్ లో 100 సింహాలు..ఇంట్రెస్టింగ్ వలస స్టోరీ

World Lion Day

Biparjoy 100 Lions 

Biparjoy-100 Lions : బీచ్ లో సింహాలు.. ఒకటి కాదు.. రెండు కాదు.. 100కు పైనే !! 

బిపర్జోయ్ తుఫాను ముప్పు నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.

గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ఎక్కడ ? ఏమిటి ? ఎందుకు ? ఇప్పుడు తెలుసుకుందాం.. 

గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అటవీ ప్రాంతం పరిధిలోని బీచ్ దగ్గరున్నలయన్  షెల్టర్ జోన్ లోని  100 సింహాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 300 ట్రాకర్ల ద్వారా ఈ సింహాల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని(Biparjoy-100 Lions)  జూన్ 12 నుంచి 16 వరకు గిర్ జంగిల్ సఫారీ, దేవలియా పార్క్‌లను మూసివేస్తామని జునాగడ్ సీసీఎఫ్ ఆరాధనా సాహు వెల్లడించారు. గిర్ సఫారీలో జూన్ 16 నుంచి 4 నెలల పాటు వర్షాకాల సెలవులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. గిర్ సఫారీని మళ్ళీ అక్టోబర్ 16న తెరుస్తామన్నారు.

అడవి నుంచి బీచ్ కు సింహాల వలస ఇలా  ?

గుజరాత్‌లోని గిర్ అడవిలో 400 దాకా సింహాలు ఉన్నాయి. ఒక సింహానికి సాధారణంగా 100 చదరపు కిలోమీటర్ల  భూభాగం అవసరం. ఇంత ప్లేస్ లో దాదాపు  నాలుగు ఆడ సింహాలు వాటి పిల్లలతో పాటు స్వేచ్ఛగా తిరుగుతూ జీవించగలవు. ఇక సింహం పిల్లలు పెద్దవయ్యాక.. అవి తమ భూభాగాన్ని(ఏరియాను)  క్లెయిమ్ చేసుకుంటాయి. ఇందుకోసం అవి..  ముసలిగా మారిన  సింహం ఏరియాను లాక్కుంటాయి. లేదంటే మరో కొత్త ఏరియాను తమ ఏలుబడి కోసం అన్వేషిస్తాయి. సింహాల సంఖ్య క్రమంగా పెరగడంతో గిర్ అటవీ ప్రాంతం వాటికి చాలలేదు. దీంతో చాలా సింహాలు వాటి ఏరియాను క్లెయిమ్ చేసుకునే క్రమంలో అటవీ ప్రాంతం సమీపంలోని బీచ్ దాకా రాకపోకలు సాగించాయి. దీన్ని గుర్తించిన అటవీ శాఖ అటువంటి  బీచ్ లను కూడా తమ పరిధిలోకి తీసుకొని సింహాలకు అక్కడ షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసింది.  అంటే.. భూమి కొరత కారణంగా గిర్ అటవీ ప్రాంతంలోని సింహాలు వాటి టెర్రిటరీని సమీపంలోని బీచ్ దాకా విస్తరించాయి.

Also read : Viral Video: ముందు మూడు సింహాలు.. వెనక భయం లేకుండా మహిళ!

సింహాలు ఈవిధంగా గిర్ అటవీ ప్రాంతం నుంచి తీర ప్రాంతాలకు వలస వెళ్లే ప్రక్రియ 1990వ దశకంలో మొదలైందని అంటారు. హెరాన్ అనే నది గిర్ ఫారెస్ట్ మీదుగా వెళ్తుంది. చివరకు ఇది సోమనాథ్ జిల్లా పరిధిలోని అరేబియా సముద్రంలో కలుస్తుంది.  సింహాలు హెరాన్ నదిని ఫాలో అవుతూ సముద్ర బీచ్ ల దాకా వలస వెళ్లాయని చెబుతుంటారు. ఇప్పడు గిర్ అడవికి 80 కి.మీ దూరంలో వెరావల్ జిల్లాలో బీచ్ దాకా సింహాల అలికిడి ఉంటుంది. ఈ ఏరియాలో వాటికి షెల్టర్ జోన్స్ ఉన్నాయి.  ఈ సింహాలు అడవిలోకి వెళ్లి అడవి పందులను, నీలి ఎద్దులను వేటాడుతుంటాయి. ఒక్కోసారి ఆహారం దొరక్క పక్క గ్రామాలకు వెళ్లి మేకలు, ఆవులను కూడా చంపేస్తుంటాయి.  ఇలా బీచ్ ల దాకా వచ్చే సింహాలను అటవీ సిబ్బంది క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తుంటారు.