Cyber Thugs 100 Cr : 28000 మందిని చీట్ చేసి..100 కోట్లు దోచారు

పాపం పండింది ! ఒకరు కాదు .. వెయ్యి మంది కాదు.. 10వేల మంది కాదు.. 28వేల మందిని మోసగించి రూ.100 కోట్లు(CYBER THUGS 100 CRORE) లూటీ చేసిన  65 మంది సైబర్ దొంగలు దొరికారు.

  • Written By:
  • Updated On - May 14, 2023 / 10:46 PM IST

పాపం పండింది ! ఒకరు కాదు .. వెయ్యి మంది కాదు.. 10వేల మంది కాదు.. 28వేల మందిని మోసగించి రూ.100 కోట్లు(CYBER THUGS 100 CRORE) లూటీ చేసిన  65 మంది సైబర్ దొంగలు దొరికారు. హర్యానాలోని నూహ్ జిల్లాలో ఉన్న 14 గ్రామాలు  కేంద్రంగా ఈ సైబర్ దొంగలు(CYBER THUGS 100 CRORE) సాగిస్తున్న చీటింగ్ చిట్టాను పోలీసులు బయటపెట్టారు. వాళ్లందరినీ పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు. కోర్టు ముందు ప్రవేశ పెట్టగా ఏడు నుంచి 11 రోజుల పాటు పోలీసు రిమాండ్‌ విధిస్తూ ఆర్డర్స్ వచ్చాయి.  వీళ్ళ బాధితులు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారని దర్యాప్తులో గుర్తించారు. వారిని పోలీసులు తమదైన స్టైల్ లో ఇంటరాగేట్ చేయగా.. తమతో పాటు మరో 250 మంది టీమ్ కూడా ఉందని వెల్లడించారు. దీంతో వాళ్ళను కూడా పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలైందని నూహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా తెలిపారు.

నూహ్  పోలీసుల అదుపులో నిందితులు (ఫైల్)

చీటింగ్ చిట్టా ఇదీ .. 

నకిలీ సిమ్ కార్డులు, ఆధార్ కార్డులతో జనం బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి డబ్బులు కాజేయడమే లక్ష్యంగా నూహ్ లోని సైబర్ దొంగల ముఠా పనిచేసేది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 219 ఖాతాలతో పాటు 140 UPI ఖాతాలను హ్యాక్ చేసి  డబ్బులు కాజేశారని విచారణలో వెల్లడైంది. జాబ్ ఆఫర్ ఉందని చెబుతూ వాట్సాప్  మెసేజ్ లు, ఈ మెయిల్స్ పంపేవారు. వాటికి రెస్పాండ్ అయ్యే వాళ్ళ నుంచి.. ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసేందుకు అంటూ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, ఆన్‌లైన్ KYC ధృవీకరణ వివరాలను సేకరించేవారు. ఈ మోసాలకు పాల్పడేందుకు హర్యానా, పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, ఈశాన్య, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టెలికాం కంపెనీల సర్కిల్‌లకు చెందిన 347 సిమ్ కార్డ్‌లను మార్చి మార్చి వీళ్ళు వినియోగించారు. ఇక హ్యాక్ చేసిన అకౌంట్లకు సంబంధించిన డబ్బును రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఉన్న తమ అకౌంట్లకు పంపేవారు. హర్యానా నుంచి ఈ చీటింగ్ జరుగుతోందనేది బయటికి పొక్కకుండా ఈ సైబర్ దొంగలు ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సైబర్ దొంగల ముఠాలోని ప్రతి ముగ్గురు లేదా నలుగురు ఒక టీమ్ గా ఏర్పడి ఒక అకౌంట్ ను హ్యాక్ చేసే పనిని మొదలు పెట్టేవారట. వీరి బాధితుల్లో ఎక్కువమంది  ఢిల్లీలోని NCR ప్రాంతం వాళ్ళే ఉన్నట్లు తేలింది. కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి సహాయం తీసుకుంటే కానీ ఈ ముఠా లొకేషన్ ను పోలీసులు ట్రాక్ చేయలేకపోయారు. దీన్నిబట్టి వీళ్ళకు టెక్నికల్ నాలెడ్జ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు దొరికిన 65 మంది సైబర్  మోసగాళ్లపై ఇప్పటికే 1346 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.