Food Safety Index 2022 : శభాష్ తమిళనాడు! ఆహార భద్రతలో దేశంలోనే నెంబర్ 1

ఆహార భద్రతలో తమిళనాడు నెంబర్ వన్ ప్లేసులో నిలిచింది. జాతీయ ఆహార భద్రతా సూచీ 2021-2022 ప్రకారం చూస్తే.. దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కానంతగా పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు మొదటి ర్యాంకును సాధించింది.

  • Written By:
  • Updated On - June 11, 2022 / 05:32 PM IST

ఆహార భద్రతలో తమిళనాడు నెంబర్ వన్ ప్లేసులో నిలిచింది. జాతీయ ఆహార భద్రతా సూచీ 2021-2022 ప్రకారం చూస్తే.. దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కానంతగా పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు మొదటి ర్యాంకును సాధించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే అది తీసుకువచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. అందుకే ర్యాంకును సంపాదించడం ఈజీ అయ్యింది.

దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా సాగుతోంది స్టాలిన్ పాలన. అందుకే ఆయన వచ్చిన ఏడాదిలోనే చాలా మార్పులు వచ్చాయి. దీనివల్లే 2020-21లో 64 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన తమిళనాడు.. ఇప్పుడు ఏకంగా 18 పాయింట్లను పెంచుకుని మొత్తం 82 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. తమిళనాడుకు ఈమధ్య పర్యాటకులు పెరగడం, రాకపోకలు ఎక్కువవ్వడంతో ఆతిథ్య రంగం భారీగా వృద్ధి చెందింది. దీనివల్ల ఆహారానికి సంబంధించి హోటళ్లు, వీధుల్లో టిఫిన్ బండ్లు, క్యాంటీన్లు, ఫుడ్ డెలివరీ వరకు అన్నింటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరిస్తోంది. దీనివల్ల ఎక్కువ మార్కులను పొందడానికి వీలైంది.

ఆహారాన్ని శుచిగా, శుభ్రంగా వండే సెంటర్లకు కేంద్రం.. ఈట్ రైట్ పేరుతో ప్రత్యేకంగా గుర్తింపు పత్రాలు ఇస్తోంది. దీంతో వాటికోసం తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. ఆయా సంస్థలు పాటించే ప్రమాణాలు బాగుంటే గుర్తింపు పత్రాలు ఇస్తున్నారు. హోటళ్లు, అంగన్ వాడీ కేంద్రాలు, వీధుల్లో అమ్మే ఆహారం, స్కూళ్లు, కాలేజీలు, పర్యాటక కేంద్రాలు.. ఇలా చాలా సెంటర్లు స్టార్ రేటింగ్ ని పొందుతున్నాయి. రాష్ట్రంలో 400కు పైగా ఆలయాలకు ఈట్ రైట్ కింద భోగ్ సర్టిఫికెట్లను అందజేశారు. భోగ్ అంటే.. బ్లిస్ ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ అని అర్థం. ఇలాంటి ధ్రువపత్రాలు పొందిన కేంద్రాలన్నీ అవి తయారుచేసే ఆహారం విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను పాటిస్తాయంటోంది ప్రభుత్వం.