Robo Leg for Snake: పాముకు రోబో కాళ్లు ఇచ్చాడు.. ఔత్సాహిక ఇంజినీర్ ప్రయోగ వీడియో వైరల్!!

తాజాగా పాము నడిచేందుకు వీలుగా... రోబో లెగ్స్ తయారుచేశాడు. వాటిని పాముకి సెట్ చేసి.. ఇక పాము పాకాల్సిన పని లేకుండా చేశాడు.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 06:45 AM IST

తాజాగా పాము నడిచేందుకు వీలుగా… రోబో లెగ్స్ తయారుచేశాడు. వాటిని పాముకి సెట్ చేసి.. ఇక పాము పాకాల్సిన పని లేకుండా చేశాడు. ఆ రోబో కాళ్లే.. అటూ ఇటూ కదులుతూ పామును ముందుకు తీసుకెళ్లగలవు..ఇది ఔత్సాహిక ఇంజనీర్ అల్లెన్ పాన్ ప్లాన్. ఆగస్ట్ 13న యూట్యూబ్ లోని తన అకౌంట్ లో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు.
ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన పాము నడుస్తూ కన్పిస్తుంది. ఇప్పటికే ఆ వీడియోని 21 లక్షల మందికి పైగా చూశారు. 1.18 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

పాముల్ని చూసి జాలి వేసి..

“నాకు పాముల్ని చూసి జాలి వేసింది. అవి వాటి కాళ్లను పోగొట్టుకున్నాయి. ఎవరూ వాటిని వెతకలేదు. నేను వెతికాను. నేను స్నేక్ లవర్‌ని” అని అల్లెన్ తెలిపాడు.

పాము రోబో లెగ్స్ ఇలా..

అల్లెన్ తయారుచేసిన యంత్రానికి మధ్యలో గ్లాస్ ట్యూబ్ ఉంది. అందులో కొండచిలువను దూర్చాడు. ఆ ట్యూబ్ కి 4 రోబో కాళ్లు ఉన్నాయి. అవి ట్యూబును ముందుకు తీసుకెళ్లాయి. అలా పాము కూడా ముందుకు వెళ్లగలిగింది. రోబో కాళ్లు… సర్వర్ నుంచి వచ్చే ఆదేశాలతో పనిచేస్తున్నాయి. సర్వర్ కి ల్యాప్ టాప్ ద్వారా కనెక్షన్ ఇచ్చారు. అందువల్ల ల్యాప్ టాప్ తో రోబో కాళ్లను కంట్రోల్ చెయ్యవచ్చు. వీడియోలో పాము మెల్లగా ముందుకు వెళ్తున్న దృశ్యం నెటిజన్లకు బాగా నచ్చింది.

ప్రయోగం కోసం పాము ఎక్కడి నుంచి తెచ్చాడనే డౌట్ చాలా మందికి ఉంటుంది. పాముల్ని పెంచే ఓ వ్యక్తి నుంచి ఈ కొండచిలువను తెచ్చాడు. ఈ ప్రయోగం చేస్తానని అతన్ని ఒప్పించాడు. ఈ ఎక్స్‌పెరిమెంట్ లో కొండచిలువకు ఎలాంటి హానీ జరగలేదు. దీనిపై నెటిజన్స్ వివిధ రకాల కామెంట్స్ చేశారు.