Seconds In Clock: గడియారాన్ని చూసినప్పుడు తొలి సెకండ్ లేటుగా కదులుతుందట.. ఈ విషయం మీకు తెలుసా?

మనం ఎప్పుడైనా గడియారం వైపు అలాగే చూస్తూ ఉంటే తొలి సెకండ్ ఆలస్యంగా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 06:10 PM IST

మనం ఎప్పుడైనా గడియారం వైపు అలాగే చూస్తూ ఉంటే తొలి సెకండ్ ఆలస్యంగా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని చాలామంది గమనించి ఉండరు. గడియారం వైపు అలాగే చూస్తున్నప్పుడు సెకండ్ ముళ్ళు మొదట మెల్లగా కదిలి ఆ తర్వాత యధావిధిగా ముందుకు వెళుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఈ విషయాన్ని గమనించినప్పటికీ తక్కువ మందికి మాత్రమే ఈ విషయాన్ని ఐడెంటిఫై చేయగలరు. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అలాగే గడియారం వైపు చూసినా కూడా ఆ తేడా ఏమిటి అనేది తెలుస్తుంది అంటున్నారు నిపుణులు.

Also Read:  Monkey Pox : మంకీపాక్స్ లైంగికంగా సంక్రమిస్తుందా ? వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలివి!!

అయితే చాలామంది ఈ విషయం చిన్న విషయమే అని అనుకుంటారు. కానీ ఇది సాధారణ విషయం కాదట. దీని వెనుక కూడా ఎంతో సైన్స్ దాగి ఉంది అంటున్నారు నిపుణులైన “AsapSCIENCE” అనే సైంటిఫిక్ యూట్యూబ్ చానల్ ఈ దృశ్య చిత్రం వెనుక ఉన్న కారణాలను ఇటీవల వివరించింది. చాలామంది మనం కళ్ళతో చూసే విదానాన్ని ఒకటే అనుకుంటాము. కానీ మనం చూసే విధానం రెండు రకాలుగా ఉంటుందట. అందులో మొదటిది ఒకే చోట ఉన్నది గాని, కదులుతూ వెళ్తున్నది గానీ, అలాగే చూస్తూ ఉండటం. దీనిని “స్మూత్ పర్స్యూట్” విధానం అంటారు.

ఒకచోటి నుంచి మరొక చోటికి గానీ లేదా ఏదైనా వస్తువు మీదికి గానీ వేగంగా దృష్టిని మరల్చడం రెండో రకం. దీనిని ‘సాకేడ్స్’ విధానం అంటారు. ఈ రెండింటిలో కళ్లు చూసే విధానం, దాన్ని మెదడు ప్రాసెసింగ్ చేసే తీరు భిన్నంగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. స్మూత్‌ పర్స్యూట్‌ విధానం ఉదాహరణగా తీసుకుంటే దూరంగా వెళుతున్న రైలు లేదా ఆకాశంలో వెళ్తున్న పక్షిని అలాగే చూస్తూ ఉంటే అవి కదులుతున్న కొద్దీ మన కళ్లు కూడా కదులుతూ వాటిని స్పష్టంగా చూస్తుంటాయి.

Also Read:  SBI New Rules : SBI ATM నుంచి రూ.10 వేల కంటే ఎక్కువ విత్ డ్రాకు ఓటీపీ మస్ట్!!

ఇక సాకేడ్స్ విధానంలో కళ్లు వేగంగా ఒకచోటి నుంచి మరోచోటికి దృష్టి మరలించడం వల్ల ఆ రెండింటి మధ్య ఉన్నవేవీ కనబడవు. వాటిని మెదడు ప్రాసెస్ చేయదు. అందువల్ల మొదటి చోటి నుంచి రెండో చోటికి దృష్టిని మరల్చినప్పుడు గడిచిన సమయాన్ని కూడా రెండో చోట చూసే దృశ్యానికి కలిపేస్తుంది. అందువల్ల అక్కడి దృశ్యం గడిచిన దానికంటే కాస్త ఎక్కువసేపు గడిచినట్టు అనిపిస్తుంది. ఈ సాకేడ్స్ దృష్టి విధానం వల్లే మనం గడియారాన్ని చూసిన వెంటనే గడిచే తొలి సెకన్ ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపిస్తుంది. ముల్లు కదలడానికి తొలి సెకన్ కు ఎక్కువ సమయం తీసుకున్న భావన కలుగుతుంది. తర్వాత మనం అలాగే చూస్తుండటం వల్ల రెండో సెకన్ నుంచి మామూలుగానే ఉన్న ఫీలింగ్ ఉంటుంది.