Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

జిమ్ కు వెళ్లకుండా.. ఇంట్లోనే వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండటం ఎలా ? ఈ ప్రశ్నకు ఎంతోమంది ఇంటర్నెట్ లో సమాధానం కోసం వెతుకుతుంటారు.

  • Written By:
  • Updated On - July 7, 2022 / 12:44 PM IST

జిమ్ కు వెళ్లకుండా.. ఇంట్లోనే వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండటం ఎలా ? ఈ ప్రశ్నకు ఎంతోమంది ఇంటర్నెట్ లో సమాధానం కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి నిపుణులు 4 రకాల ఆప్షన్లతో ప్రాక్టికల్ ఆన్సర్ చెబుతున్నారు. ఇంట్లోనే ఉంటూ.. ఇంటర్నెట్ ను వాడుకొని ఫిట్నెస్ జర్నీ చేయొచ్చని సూచిస్తున్నారు. వాళ్ళు చెబుతున్న ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. ఫిట్ నెస్ యాప్స్.. వర్చువల్ క్లాస్

ఇది మొబైల్ యాప్స్ యుగం. ప్రతి సమాచారం ప్రత్యేక యాప్ లలో దొరుకుతోంది. మీకు స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ ట్యాప్ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా చాలు. మీ ఫిట్ నెస్ లెర్నింగ్ ను మొదలు పెట్టొచ్చు. మీరు నివసించే నగరంలోని కొన్ని ప్రధాన జిమ్ సెంటర్లు కూడా యాప్స్ ద్వారా వర్చువల్ ఫిట్ నెస్ క్లాస్ లు నిర్వహిస్తున్నాయి.దీనికి నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నాయి. ప్రారంభంలో కొన్ని రోజుల పాటు ఉచితంగా డెమో క్లాస్ లు వినే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని ప్రఖ్యాత జిమ్ ట్రైనింగ్ సెంటర్స్ ఇప్పటికే దీన్ని కూడా పెద్ద వ్యాపార అవకాశంగా మల్చుకున్నాయి. కొవిడ్ లాక్ డౌన్ కాలంలో ఇటువంటి వర్చువల్ తరగతులను వింటూ ఎంతోమంది తమతమ ఇళ్ల వద్దే జిమ్ వర్క్ ఔట్స్ చేశారు.

2.youtube.. నాలెడ్జ్ హబ్ గురూ

youtube గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉదయం నుంచి రాత్రి దాకా ప్రజలు ఇందులోనే మునిగి తేలుతున్నారు. జిమ్ కు వెళ్లే సమయం, స్థోమత లేకున్నా.. జిమ్ కు వెళ్లాలనే ఆసక్తి లేకున్నా బాధపడొద్దు. ఎందుకంటే.. మీ ఆరచేతి ఫోన్లోనే యావత్ ప్రపంచ జ్ఞానం ఉంది. youtube ఓపెన్ చేసి బిగినర్స్ కోసం తేలికపాటి, ప్రైమరీ జిమ్ వర్క్ ఔట్స్ ను సెర్చ్ చేయండి. ఎంతోమంది జిమ్ ట్రైనర్స్ అప్ లోడ్ చేసిన వీడియోలు ప్రత్యక్షం అవుతాయి. వాటిలో ఎక్కువ సబ్ స్క్రైబర్స్ ఉన్న .. సులభతరంగా క్లాస్ చెబుతున్న జిమ్ ట్రైనర్ ను ఎంచుకోండి. రోజూ ఒక నిర్ణీత సమయంలో ఆ క్లాస్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగాక .. సమీపంలోని జిమ్ లో జాయిన్ అయ్యే విషయాన్ని ఆలోచించండి.

3. ప్లానింగ్.. ప్లానింగ్

ప్లానింగ్ తప్పనిసరి. ఇది లేకుండా ఏం చేయలేం. జిమ్ వర్క్ అవుట్ గోల్స్ ను వీక్లీ కింద విడగొట్టుకోండి. ఉదాహరణకు ప్రతి వారం నాలుగు సార్లు ఒక మైలు దూరం వాకింగ్ చేయాలనే టార్గెట్ పెట్టుకోండి. ప్రతి వారం 45 నిమిషాల నిడివికల మూడు యోగా క్లాస్ లు అటెండ్ కావాలని లక్ష్యం నిర్దేశించుకోండి. మరుసటి రోజు జిమ్ కోసం అవసరమైన మొత్తం సామగ్రిని ఒకరోజు ముందు రాత్రి సిద్ధం చేసి పెట్టుకోండి. వర్క్ ఔట్స్ చేసే సమయంలో వినేందుకు మోటివేషనల్ సాంగ్స్ లిస్ట్ రెడీ చేసుకోండి. తీసుకోవాల్సిన ఫుడ్ కూడా రెడీగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

4. ఎందుకు.. అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి

ప్రతి పనికి ఒక లక్ష్యం ఉన్నట్టే.. జిమ్ చేయడానికి కూడా ఒక లక్ష్యం ఉంది. కేవలం బరువును తగ్గించుకోవడం ఒక్కటే టార్గెట్ అంటే సరికాదు. జిమ్ చేయడం వల్ల మానసిక, శారీరక వికాసానికి బాటలు పడతాయి. ఫలితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మీ కెరీర్ విజయానికి బాటలు వేసే వారధిగా జిమ్ ఫిట్ నెస్ పనికి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం స్థాయిలను పెంచుతుంది.