Hair Dryness : శీతాకాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే?

చల్లని గాలి కారణంగా జుట్టు పొడిబారడం (Hair Dryness), జీవంగా మారడం జుట్టు చిట్లిపోవడం ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 06:40 PM IST

Hair Dryness in Winter : శీతాకాలం మొదలయ్యింది అంటే చాలు జుట్టు సమస్యలతో చర్మ సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎందుకు గల కారణం శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం. అలాగే చల్లని గాలులు కూడా వీచడం. చల్లని గాలి కారణంగా జుట్టు పొడిబారడం (Hair Dryness), జీవంగా మారడం జుట్టు (Hair) చిట్లిపోవడం ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు ఉపయోగిస్తూ ఉంటారు. వీటి కారణంగా హెయిర్ ఫాల్ సమస్య రావచ్చు. కాబట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా శీతాకాలంలో కొన్ని చిట్కాలతో జుట్టుకు సంబంధించిన సమస్యలను ఎలా నివారించవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

శీతాకాలంలో చాలామంది నీళ్లు ఎక్కువగా తాగరు. క్లైమేట్ కూల్ గా ఉండడంతో చాలామంది నీటిని తాగడానికి అంతగా ఆసక్తిని చూపించరు. కానీ అలా అస్సలు చేయకూడదు. శీతాకాలంలో కూడా శరీరానికి సరిపడినన్ని నీళ్లు తాగడం అవసరం. శరీరం హైడ్రేట్‌గా ఉండాటనికి, కణాలు, కణజాలాలలో ఆక్సిజన్‌ ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి, జుట్టు (Hair) హెల్తీగా ఉండాటనికి, హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి సరిపడా నీళ్లు చాలా అవసరం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా (Hair Dryness) రక్షించుకోవడానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. సీజనర్‌ దొరికే కూరగాయలు, పండ్లు మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.

ఇవి జుట్టుకు కూడా పోషణ అందించి, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సీజన్‌లో దొరికే పండ్లు, కూరగాయలు కచ్చితంగా తీసుకోండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చలికాలంలో వేడి బజ్జీలు, సమోసాలు ఎక్కువగా లాగించేస్తూ ఉంటారు. చలికాలం మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేయించిన ఫుడ్స్‌కు దూరంగా ఉండడం చాలా అవసరం. చలికాలంలో జుట్టుకు తరచుగా నూనె పెట్టడం అసలు మర్చిపోకండి. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. ఇది జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండి, వేడినీటితో స్నానం, తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి.

Also Read:  Chapati and Rice : చపాతీ, అన్నం కలిపి తింటే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో మీకు తెలుసా?