Back Pain: వెన్ను నొప్పి, వీపునిప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఆసనాలు ట్రై చేయాల్సిందే?

ఈ రోజుల్లో వెన్నునొప్పి అన్నది కామన్ అయిపోయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ వెన్నునొప్పి కారణంగా చాల

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 10:35 PM IST

ఈ రోజుల్లో వెన్నునొప్పి అన్నది కామన్ అయిపోయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ వెన్నునొప్పి కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సొంతంగా వారి పనులు వారు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి చక్కని చిట్కా. కొన్ని రకాల ఆసనాలు ట్రై చేయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.. ఆ ఆసనాలు ఏంటో అవి ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ట్విస్ట్… ముందుగా మీ పాదాలను నేలపై గట్టిగా ఉంచి కుర్చీపై కూర్చొని,మీ తొడలపై మీ చేతులు రెస్ట్ తీసుకోవాలి. మీ కుడిచేతిని కుర్చీ పైభాగంలో ఉంచి,మీ లోయర్ బాడీని కుడివైపుకి వంచాలి. ఇప్పుడు మీ ఎడమ చేతిని కుర్చీ అంచున, కుడి తొడకు దగ్గరగా ఉంచాలి. మీ వీపు, మెడకు నొప్పులు కాకుండా వీలైనంత వరకు పక్కకు వంగాలి. ఈ పొజిషన్‌లోనే ఉండి ఫస్ట్ పొజిషన్‌ వరకూ రావాలి. ఇలా మరోసారి చేస్తే చాలు.

ఉత్తనాసనం…. మీ పాదాలను నేలపై గట్టిగా ఉంచి కుర్చీపై కూర్చోండి. మీ పాదాలను కొద్దిగా దూరంగా ఉంచి, మీ చేతులని తలపైకి పెట్టాలి. ఆపై నెమ్మదిగా తుంటి నుండి ముందుకు వంగి, మీ బాడీ తొడలపై విశ్రాంతి తీసుకోవాలి. అదే సమయంలో మీ చేతులని క్రిందకి తీసుకురావాలి. మీ రెండు చేతులతో పాదాలపై చీలమండలను పట్టుకుని క్రిందికి చాచాలి. ఈ పొజిషన్‌లో కొన్ని సెకన్ల పాటు తాత్కాలికంగా పట్టుకున్న తర్వాత మొదటి స్థానానికి తిరిగిరావాలి.

వైడ్ స్టాండ్ ఫార్వర్డ్ బెండ్… కుర్చీ వెనుక నిటారుగా నిలబడాలి. తరువాత ముందుకు వంగి, మీ మోచేతులని కుర్చీ పైభాగంలో ఉంచి, మీ మణికట్టును పైకి వంచి రెండు అరచేతులని ఒక చోట చేర్చాలి. మీ మెడను చాచి, మీ తలని కొద్దిగా క్రిందికి తీసుకురావాలి. మీ నడుముని పక్కకి చెప్పాలి. ఈ విధంగా ఈ ఆసనాన్ని నాలుగు నుండి ఐదుసార్లు రిపీట్ చేసీ, ఆపై ప్రారంభ స్థానానికి రావాలి.

కూర్చుని మత్స్యాసనం… ముందుగా మీ పాదాలను నేలపై ఉంచి కుర్చీపై కూర్చోని, మీ చేతులని పైకి తీసుకురావాలి. మీ వెన్నెముకని రెస్ట్ తీసుకొని మీ వీపుని లోపలికి తీసుకుని చేతులని వెనక్కి చాచాలి. ఈ పొజిషన్‌లోనే కొన్ని సెకన్ల పాటు ఉండి రెస్ట్ తీసుకోవాలి.