Bihar : పెళ్లి బరాత్ లో బెదిరిన గుర్రం..జనాలను తొక్కుతూ..ఒకరి పరిస్థితి విషమం..!!

  • Written By:
  • Updated On - November 13, 2022 / 11:07 AM IST

బీహార్ లో పెళ్లి వేడుకలో గుర్రం బెదిరింది. పెళ్లికి వచ్చిన జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భాగల్ పూర్ లో చోటుచేసుకుంది. సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు రథాన్ని సిద్ధం చేశారు. ఊరేగింపుగా వధువు ఇంటికి బయలుదేరారు. పెళ్లికి హాజరైన వారంతా…డ్యాన్సులతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. డ్యాన్సులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రథం రోడ్డుపైకి వచ్చింది… అయితే అటుగా వెళ్తున్న ఓ వాహనం గట్టిగా హారన్ కొట్టడంతో ఒక్కసారిగా గుర్రం బెదిరి జనాలపై దూసుకెళ్లింది.

అక్కడున్న జనాలకు ఏమైతుందో అర్థం కాలేదు. భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. గుర్రం జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుగా ఇరుకుగా ఉండటం..చూట్టూ దుకాణాలు ఉండటంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. అయితే ఘటన సమయంలో వరుడు గుర్రంపైన్నే ఉన్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.