తెలంగాణ‌పై ధ‌ర్మ‌ల్ పొగ..కాలుష్య రాష్ట్రాల్లో రెండో స్థానం

బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కాలుష్యం భారీ వెలువ‌డుతుంది. అందుకు త‌గిన ప్ర‌మాణాల‌ను పాటించ‌క‌పోతే..ప‌ర్యావ‌ర‌ణం నాశ‌నం అవుతుంది. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఆయా రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది.

  • Written By:
  • Publish Date - October 1, 2021 / 03:30 PM IST

బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కాలుష్యం భారీ వెలువ‌డుతుంది. అందుకు త‌గిన ప్ర‌మాణాల‌ను పాటించ‌క‌పోతే..ప‌ర్యావ‌ర‌ణం నాశ‌నం అవుతుంది. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఆయా రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. సీఎస్ ఈ తాజాగా త‌యారు చేసిన నివేదిక‌ల ఆధారంగా దేశ వ్యాప్తంగా కాలుష్యాన్ని వెద‌జ‌ల్లే ప్రాజెక్టులు క‌లిగిన రాష్ట్రాల జాబితాలో ‌మొదటి స్థానంలో వెస్ట్ బెంగాల్‌, రెండో స్థానంలో తెలంగాణ‌, మూడోది గుజ‌రాత్ గా ఉన్నాయి.
బొగ్గు ఆధారిత విద్యుత్ ను త‌యారు చేస్తోన్న తెలంగాణ ప్రాజెక్టులు పరిమాణాన్ని మించిన స‌ల్ఫ‌ర్ డ‌యాక్సైడ్ నుంచి విడుద‌ల చేస్తున్నాయి. ప‌శ్చిమ బెంగాల్ 85శాతం కాలుష్యంతో ధ‌ర్మ‌ల్ ప్రాజెక్టులు క‌రెంట్ ను త‌యారు చేస్తున్నాయి. 75శాతం కాలుష్యంతో తెలంగాణ ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ను జ‌న‌రేట్ చేస్తోంది. గుజ‌రాత్ 71శాతం కాలుష్యం వెద‌జ‌ల్లే ప్రాజెక్టులు ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ను ఇస్తున్నాయి. ఆ విష‌యాన్ని సీఎస్ఈ ఇటీవ‌ల ప్ర‌క‌టిచింది.
తెలంగాణ స్టేట్ ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న కొత్త‌గూడెం, సింగ‌రేణి ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టులు ఎక్కువ‌గా కాలుష్యం వెద‌జ‌లుతున్నాయి. దీనికి తోడు బ‌య‌ట నుంచి వ‌స్తోన్న విద్యుత్ కేంద్రాల కాలుష్యం తెలంగాణ‌ప్రాంతాన్ని సల్ఫ‌ర్ డ‌యాక్సైడ్ నింపేస్తుంద‌ని సీఎస్ఈ సైంటిస్ట్ సౌంద‌రం రామ‌రాజ‌న్ అభిప్రాయం.
స‌ల్ఫ‌ర్ డ‌యాక్సైడ్ మోతాదు ఆధారంగా కంపెనీల‌ను మూడు ర‌కాలుగా సీఎస్ ఈ వ‌ర్గీక‌రించింది. వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని కాపాడే భ‌ద్ర‌త‌ను తీసుకున్న కంపెనీలకు ఎల్లో క‌ల‌ర్, భ‌ద్ర‌త కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్న వాటికి ఆరంజ్ , ఎలాంటి భ‌ద్ర‌త చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ముందుకు రాని ప్రాజెక్టుల‌కు రెడ్ మార్క్ ను కేటాయించ‌డం జ‌రిగింది. తెలంగాణ‌లోని 74 శాతం ప్రాజెక్టులు ఆరంజ్, 26శాతం ప్రాజెక్టులు ఎల్లో మార్క్ ను పొందాయ‌ని సీఎస్ఈ వెల్ల‌డించింది. ఇప్ప‌టికైనా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌మాద‌క‌రంగా ఉన్న ధ‌ర్మ‌ల్ కాలుష్యాన్ని క‌ట్ట‌డీ చేయ‌క‌పోతే రాష్ట్రం మ‌స‌క బార‌డం ఖాయం.