Chandrayaan 3: నిద్రలేచిన ‘చంద్రయాన్ 3’.. ల్యాండర్ నుంచి మళ్లీ సిగ్నల్స్

Chandrayaan 3 : ‘చంద్రయాన్ 3’.. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్‌ పేరు సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసిన ప్రయోగం.

  • Written By:
  • Updated On - January 20, 2024 / 10:20 AM IST

Chandrayaan 3 : ‘చంద్రయాన్ 3’.. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్‌ పేరు సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసిన ప్రయోగం. ‘చంద్రయాన్ 3’ ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్  ప్రజ్ఞాన్‌లు గతేడాది ఆగస్ట్‌ 23 నుంచి 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు చేశాయి. ఆ తర్వాత జాబిల్లిపై చీకటి కావడంతో ల్యాండర్, రోవర్‌లను ఇస్రో స్లీప్‌మోడ్‌లోకి పంపించింది. దక్షిణ ధ్రువం వద్ద ప్రస్తుతం స్లీప్‌ మోడ్‌లో ఉన్న చంద్రయాన్‌ 3 ల్యాండర్ నుంచి తాజాగా సిగ్నల్స్ వచ్చాయని ఇస్రో వెల్లడించింది.  ప్రస్తుతం తాము ల్యాండర్‌లోని పరికరాల లొకేషన్లను గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. చంద్రయాన్‌ 3 ల్యాండర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) ఉంది. ఆ లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్‌లోని లేజర్‌ రెట్రో రెఫ్లెక్టర్‌ ఎరే (ఎల్‌ఆర్‌ఏ).. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్‌ మార్కర్‌ సేవలను పునరుద్ధరించిందని ఇస్రో(Chandrayaan 3) శాస్త్రవేత్తలు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రయాన్‌ 3లో వివిధ సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఏలను అమర్చినా.. నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏ మాత్రం నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని ఇస్రో తెలిపింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్‌ఆర్‌ఏ పర్యవేక్షణ మొదలవుతుందని చెప్పింది. చంద్రయాన్‌ 3 నుంచి తూర్పు వైపునకు మళ్లీ ఉన్న ఎల్‌ఆర్‌ఓలోని లేజర్‌ అల్టిమీటర్‌ (లోలా) చంద్రయాన్‌ 3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతుంది. ఇందులోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటు అయ్యాయి. దాదాపు 20 గ్రాముల బరువు ఉండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై పనిచేసేలా తయారు చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో సేవలందిస్తున్న ఎల్‌ఆర్‌ఏ ఇదొక్కటే కావడం గమనార్హం.

Also Read: TSPSC New Team : టీఎస్‌పీఎస్‌సీ పోస్టులకు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అప్లికేషన్లు

గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులకు ఇస్రో గుడ్ న్యూస్

గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ కలిసి ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును ఇస్రో ప్రకటించింది. ‘జియోడేటా ప్రాసెసింగ్ యూజింగ్ పైథాన్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్‌ 2024 జనవరి 16 నుంచి 27 వరకు కొనసాగుతుంది. కోర్సు పూర్తి చేసేవారు జియోస్పేషియల్, శాటిలైట్ డేటా ప్రాసెసింగ్ వంటి సబ్జెక్టులపై పట్టు సాధించవచ్చు. భారత ప్రభుత్వం ఈ కోర్సును స్పాన్సర్ చేస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లేదా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌ దీనికి అర్హులు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో సైన్స్ లేదా టెక్నాలజీ రిలేటెడ్ రోల్స్‌లో పని చేస్తూ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. CIET లేదా CEC-UGC నెట్‌వర్క్‌ యూజర్లు కూడా అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీ లేదా ఇలాంటి సంస్థలో ఉపాధ్యాయులు లేదా పరిశోధకులు కూడా దీనికి అర్హులే.