WHO Warning : టీకాలు వేయని వారికి ఓమిక్రాన్ ముప్పు

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులతో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో WHO హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని, ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోని వారికి ఈ వైర‌స్ సోకితే చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించింది.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 04:19 PM IST

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులతో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో WHO హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని, ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోని వారికి ఈ వైర‌స్ సోకితే చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించింది. డెల్టా కంటే ఒమిక్రాన్ తక్కువ తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందని కానీ ఇది ప్రమాదకరమైన వైరస్‌గా ఉంద‌ని WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు.

ప్రజలు ఓమిక్రాన్‌ను తేలికపాటిదిగా పరిగణిస్తున్నారని… ఇది సాధారణ జలుబు కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఓమిక్రాన్ వేరియంట్ ని అంత తెలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ తెలిపారు. ఓమిక్రాన్ తక్కువ తీవ్రంగా కనిపించినప్పటికీ చాలా ప్ర‌మాద‌క‌రమ‌ని ఆయ‌న తెలిపారు. భారతదేశంలోని మొత్తం 300 జిల్లాలు కోవిడ్-19 కేసుల పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాలు కేసులు పెరుగుతుండ‌టంతో అక్క‌డ ఆందోళన మొద‌లైంద‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో హై-రిస్క్ నగరాల కోవిడ్ వీక్లీ పాజిటివిటీ రేటును విడుదల చేసింది. గ‌త వారంలో కోల్‌కతాలో అత్యధిక పాజిటివిటీ రేటు ఉందని.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై కంటే 60.29 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది. .కోల్‌కతాలో అత్యధిక వీక్లీ పాజిటివిటీ రేటు నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జనవరి 5, జనవరి 12 మధ్య వారంలో ముంబైలో పాజిటివిటీ రేటు 26.95 శాతం, బెంగళూరులో 12.29 శాతం, థానేలో 31.54 శాతం, చెన్నైలో 23.32 శాతం, పూణేలో 23.4 శాతం, కోల్‌కతాలో 29 శాతంగా ఉంది. శాతం. ఢిల్లీలో పాజిటివిటీ రేటు దాదాపు 23 శాతంగా ఉంద‌ని తెలిపింది.