Ramadan 2023: రంజాన్ ఉపవాస సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.

పవిత్ర రంజాన్ (Ramadan)  ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో నిష్టతో ఈ రంజాన్ ఉపవాసాన్ని(ramadan fasting) పాటిస్తుంటారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇతర ముస్లిం దేశాలలో మార్చి 21 సాయంత్రం చంద్రుడు కనిపించినప్పుడు రంజాన్ ఈ సంవత్సరం మార్చి 22 న ప్రారంభమైంది.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 04:42 AM IST

పవిత్ర రంజాన్ (Ramadan)  ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో నిష్టతో ఈ రంజాన్ ఉపవాసాన్ని(ramadan fasting) పాటిస్తుంటారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇతర ముస్లిం దేశాలలో మార్చి 21 సాయంత్రం చంద్రుడు కనిపించినప్పుడు రంజాన్ ఈ సంవత్సరం మార్చి 22 న ప్రారంభమైంది. రంజాన్ ఉపవాస సమయంలో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటుంటారు. సాంప్రదాయకంగా ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమిస్తుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలం పాటు ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఇన్సులిన్ మోతాదు గురించి లేదా మందుల విషయాల్లో మార్పుల గురించి వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉపవాసం ఉండాలి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు హైపోగ్లైకేమియా లేదా హైపర్గ్లైసీమియాకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపవాస సమయంలో రక్తం షుగర్ లెవెల్స్ ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. సూర్యోదయానికి ముందు రోజు మొదటి భోజనం అయిన సెహ్రీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం, చక్కెర, అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని తగ్గించడం వంటివి ఉపవాస సమయంలో ఖచ్చితంగా పాటించాలి.

రంజాన్ ఉపవాసం దాదాపు నెలరోజుల పాటు ఉంటుంది. ఈ మాసంలో ఎన్నో రుచికరమైన వంటకాలతో జరుపుకుంటారు. ప్రతిరోజూ ఎక్కువ సమయం ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రం కొద్దిగా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం. నూనెలో వేయించిన వంటకాలు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తింటుంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిన పెంచుతాయి. కొవ్వు కాలేయం, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుంది.

నిద్ర:

శరీరానికి కావాల్సినంత నిద్ర ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా ఉపవాస సమయంలో తగినంత నిద్ర అవసరం. రంజాన్ సమయంలో, మీకు సెహ్రీ, మీ తెల్లవారుజామున భోజనం రోజంతా అలసిపోకుండా ఉండటానికి తగినంత శక్తి అవసరం. కాబట్టి మీరు ఉపవాసం ప్రారంభించేందుకు ఒక గంట ముందు లేచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జీర్ణం అయ్యేందుకు సులభంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను నివారించేందుకు సహాయపడుతుంది.

హైడ్రేటెడ్ గా ఉండాలి:

‘ఉపవాసం ఉండే వారికి హైడ్రేటింగ్ డ్రింక్స్ ముఖ్యం. డీహైడ్రేషన్ అనేది ఉపవాస సమయంలో ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఎదురయ్యే ఒక తీవ్రమైన ప్రమాదం. లెమన్ జ్యూస్, మజ్జిగ, కొబ్బరి నీరు, పుచ్చకాయలు, తక్కువ చక్కెర ఉన్న తాజా పండ్ల రసాలు తీసుకోవాలి. వీటితో రిఫ్రెష్ ,హైడ్రేటింగ్‌గా ఉంటాయి.

ప్రోబయోటిక్స్ చేర్చండి:

సెహ్రీ తిన్న తర్వాత ఒక చెంచా పెరుగు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది. ఇది పొట్టకు ఉపశమనం కలిగించడమే కాకుండా, ఎసిడిటీని నివారిస్తుంది

ఇఫ్తార్ కోసం షుగర్ ఫ్రీ డ్రింక్‌:

షుగర్ ఫ్రీ హైడ్రేటింగ్ డ్రింక్‌తో మీ ఉపవాసాన్ని విరమించండి. తక్కువగా తినేందుకు ప్రయత్నించండి. మసాలా ఫుడ్ కు బదులుగా పండ్లు తినండి. పండ్లు, చిక్కుళ్లు, లీన్ ప్రొటీన్స్, తక్కువ చక్కెర ఉన్న పదార్థాలు, పాలు, పండ్ల రసాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిని పర్యవేక్షించడం:

షుగర్ పేషంట్లు ఉపవాసం ప్రారంభించే ముందు రక్తంలో షుగర్ లెవల్స్ ను చెక్ చెసుకోవాలి. ఇన్సులిన్ తీసుకునే డాక్టర్ ను సంప్రదించాలి. వైద్యుల సిఫార్సు మేరకు ఇన్సులిన్ లో మార్పులు చేసుకోవాలి. మూత్రపిండ వ్యాధి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అనియంత్రిత టైప్ 1 మధుమేహం వంటి వారు ఉపవాసానికి ముందు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి.