Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ ఉపయోగాలేంటో తెలుసుకోండి..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో గుండె ఆరోగ్యం బలపడుతుందని తేలింది. గట్ మైక్రోబయోమ్‌ పై కూడా ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుందని అధ్యయనాలు...

Published By: HashtagU Telugu Desk
Know The Benefits Of Intermittent Fasting.

Know The Benefits Of Intermittent Fasting.

ఉపవాసం (Fasting) ఉండటం భారతీయులకు కొత్తేం కాదు. అయితే ఇటీవల వివిధ రకాల ఫాస్టింగ్ టెక్నిక్స్ ప్రపంచ దేశాల్లో పాపులర్ అయ్యాయి. వీటిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) ఒకటి. ఈ విధానంలో రోజులో కొన్ని గంటల పాటు ఉపవాసం ఉంటారు. నిర్ణీత సమయాల్లోనే తినడం, కొన్ని గంటల పాటు ఉపవాసం (Fasting) ఉండటం వంటివి పాటిస్తారు. బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి ఒక మార్గంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ ఫాలో అవుతారు. రీసెంట్ స్టడీస్‌లో ఈ తరహా ఫాస్టింగ్‌తో గుండె ఆరోగ్యం కూడా బలపడుతుందని తేలింది. మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే గట్ మైక్రోబయోమ్‌ (Gut Microbiome)పై కూడా ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) కారణంగా గట్ (Digestive System) హెల్త్ మెరుగుపడుతుంది. నిజానికి గట్ మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, విటమిన్లను తయారు చేయడానికి, హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షించడానికి సహాయపడే సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. కాగా ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ గట్‌లో ఉండే వివిధ రకాల సూక్ష్మజీవుల మార్పుకు కారణం అవుతుంది. గట్ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. జీర్ణ సంబంధ వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. సూక్ష్మజీవుల వైవిధ్యంలో ఈ మార్పు గట్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అలానే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గట్ సామర్థ్యాన్ని పెంచుతుంది.

గట్ హెల్త్‌ బూస్టర్:

ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) గట్‌లో లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి ప్రయోజనకరమైన బాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. అంతేకాకుండా, ప్రొటీబాక్టీరియా, క్లోస్ట్రిడియం వంటి హానికరమైన బ్యాక్టీరియాల సంఖ్యను తగ్గిస్తుంది. ఈ ఉపవాసం (Fasting) గట్ బ్యారియర్ ఫంక్షన్‌ను కూడా ప్రోత్సహిస్తుంది. గట్ బ్యారియర్ అనేది పేగులలోని రక్షిత పొర, ఇది శరీరంలోకి హానికరమైన పదార్థాలు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. గట్ బ్యారియర్ బలహీనంగా ఉన్నప్పుడు, ఇది లీకీ గట్ సిండ్రోమ్ అనే పరిస్థితికి దారి తీస్తుంది, ఇక్కడ హానికరమైన పదార్థాలు శరీరంలోకి లీక్ కావచ్చు.

ఇతర ప్రయోజనాలు:

అలానే ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) ఫాలో కావడం వల్ల శరీర భాగాల్లో ఇన్‌ఫ్లమేషన్, ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. పేగు పూత వ్యాధి (IBD) లక్షణాలను నివారించడం లేదా తగ్గించడంలోనూ ఈ ఉపవాసం (Fasting) దోహదపడుతుంది. అలాగే, జీర్ణక్రియ శక్తిని ఇంప్రూవ్ చేసి అజీర్తి వ్యాధులను తగ్గించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.

ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్‌తో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి, కానీ ఇది అందరికీ తగినది కాకపోవచ్చు. కాబట్టి దీనిని ప్రారంభించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఫాస్టింగ్ వల్ల వచ్చే గట్‌ ప్రయోజనాలన్నీ కూడా ఎర్లీ స్టడీస్‌లో తేలాయి. ఇంకా ఈ ప్రయోజనాలపై పూర్తి క్లారిటీ రావడానికి మరిన్ని రీసెర్చ్‌లు అవసరమవుతాయి.

Also Read:  Teeth: తళతళ మెరిసే పళ్లకోసం ఈ ఆహారాలను తినండి..!

  Last Updated: 11 Mar 2023, 05:05 PM IST