Ulcers: అల్లాడించే అల్సర్స్.. కారణాలు, పరిష్కారాలు

పేగులలో అల్సర్స్, ఇన్ఫెక్షన్లతో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. ఒక్కసారి అల్సర్‌ వస్తే దీర్ఘకాలంపాటు వేధిస్తుంది.

పేగులలో అల్సర్స్ (Ulcers), ఇన్ఫెక్షన్లతో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. ఒక్కసారి అల్సర్‌ వస్తే దీర్ఘకాలంపాటు వేధిస్తుంది. అడ్డుఅదుపూ లేని జీవనశైలి, గాడితప్పిన ఆహారపు అలవాట్లు జీర్ణవ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. అందుకే మన పేగుల్లో అల్సర్లు (Ulcers) వస్తాయి. అందుకే టైంకి భోజనం చేయాలి. ఎక్కువ కారం కలిగిన ఆహారాలు, ఫ్రైలు, మసాలా వంటకాలను తరచుగా తింటే అల్సర్స్ (Ulcers) వస్తాయి. అధికంగా పెయిన్‌ కిల్లర్‌, గ్యాస్‌ మాత్రలు వాడినా అల్సర్‌ వస్తుంది. స్ట్రెస్‌, ఆందోళన, ధూమపానం, ఆల్కహాల్‌ సేవించడం వల్ల కూడా పొట్టలోని మ్యూకోజ్‌ పొరకు చిరుగులు ఏర్పడి అల్సర్లకు దారితీస్తుంది.

ఎండోస్కోపీ..

ఎండోస్కోపీ ద్వారా అల్సర్ల తీవ్రతను తెలుసుకోవచ్చు. ఎండోస్కోపీలో ఒక చిన్న కెమెరా లెన్స్‌తో కూడిన సన్నని ట్యూబ్‌ను రోగి యొక్క గొంతు నుంచి అన్నవాహిక మరియు కడుపులోకి పంపుతారు. మందులను వాడటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఐతే మళ్లీ మళ్లీ ఇవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలా వంటకాలు, కారంతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

పెప్టిక్ అల్సర్లు..

  1. పెప్టిక్ అల్సర్లు అంటే.. కడుపు లోపలి పొర , చిన్న ప్రేగు ఎగువ భాగంలో ఏర్పడే బాధాకరమైన ఓపెన్ పుండ్లు. పెప్టిక్ అల్సర్ యొక్క అత్యంత సాధారణ సంకేతం కడుపు నొప్పి.
  2. ఈ పెప్టిక్ అల్సర్లు రెండు రకాలు. మొదటిది.. కడుపులో అభివృద్ధి చెందే గ్యాస్ట్రిక్ అల్సర్స్. రెండోది.. చిన్న ప్రేగు (డ్యూడెనమ్) మొదటి భాగంలో అభివృద్ధి చెందే డ్యూడెనల్ అల్సర్స్.
  3. బాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీ (H. పైలోరీ) ఇన్ఫెక్షన్, ఇబుప్రోఫెన్ వంటి NSAIDల దీర్ఘకాలిక వినియోగం వల్ల పెప్టిక్ అల్సర్లు వస్తాయి. ఒత్తిడి మరియు పెప్టిక్ అల్సర్ల మధ్య ఎటువంటి సంబంధం లేదు. కానీ అవి అల్సర్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
  4. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది కడుపు లైనింగ్‌లో అల్సర్‌లకు ప్రధాన కారణాలలో ఒకటి. 90% పెప్టిక్ అల్సర్‌లకు H. పైలోరీ బ్యాక్టీరియా కారణం. ఇది అపరిశుభ్రమైన ఆహారం , నీరు లేదా H. పైలోరీ బ్యాక్టీరియా సోకిన వ్యక్తితో శారీరక ద్రవాల మార్పిడి ద్వారా వ్యాపిస్తుంది.
  5. నాన్‌ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAI) మితిమీరిన వినియోగం కూడా పెప్టిక్ అల్సర్‌లకు కారణం కావచ్చు.
  6. మానవ శరీరంలో కడుపు లోపలి ఉపరితలంపై యాసిడ్ యాక్టివిటీ జరిగినప్పుడు అల్సర్లు వస్తాయి.

అల్సర్ లక్షణాలు

  1. గుండెల్లో మంట, వికారం
  2. మసాలా ఆహారాలు, కాఫీ వంటి కొన్ని ఆహారాలకు అలర్జీ
  3. ఛాతీ ప్రాంతంలో విపరీతమైన త్రేనుపు, అసౌకర్యం
  4. కడుపులో నొప్పి, ఉబ్బరం
  5. రక్త వాంతులు, మలంలో రక్తం

అల్సర్లను నయం చేసే జ్యూస్ లు

క్యాబేజీ జ్యూస్

క్యాబేజీ జ్యూస్ అల్సర్లను నయం చేయడంలో సహాయపడుతుంది. కడుపులోని పుండ్లను నయం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. క్యాబేజీలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజూ ఒక గ్లాస్‌ క్యాబేజీ రసం తాగితే అల్సర్లు తగ్గుతాయి.

తేనె

తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. తేనె మన శరీరంలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అల్సర్ కలిగించే బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్సర్‌ సమస్య ఉన్నవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి రోజుకు రెండు సార్లు తీసుకోండి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కాంపౌండ్‌ ఉంటుంది. దీనికి శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. పెప్టిక్ అల్సర్‌లకు కారణమయ్యే అల్లిసిన్‌‌‌ హెలికో బాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియాతో పోరాడేందుకు ఇది సహాయ పడుతుంది. మీ డైట్‌లో రోజుకు 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలను చేర్చుకోండి. ప్రతిరోజూ 1 వెల్లుల్లిని తిన్నా మంచిది.

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌గా పసిచేస్తుంది. దీనివల్ల కడుపులో అల్సర్లకు కారణమయ్యే.. బ్యాక్టీరియా పెరగదు. కర్కుమిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపులో అల్సర్ల సమస్య ఉన్నవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పసుపు వేసి రోజుకు 2 నుంచి 3 సార్లు తాగితే మంచిది. దీనిలో తేనె కలిపితే టేస్ట్‌ బాగుంటుంది.

Also Read:  Weddings:పెళ్లిళ్లలో ఓవర్ ఈటింగ్ ని తప్పించే చిట్కాలివీ..