Caffeine : ఉపవాసంలో కాఫీ తాగుతున్నారా…? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..!!

ఉపవాసం...భక్తితోపాటు..ఆరోగ్యానికి కూడా మంచిది. వారానికి ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉంటే...శరీరం పునరుత్తేజం అవుతుందని వైద్యులు కూడా చెబుతుంటారు.

  • Written By:
  • Updated On - July 1, 2022 / 09:49 AM IST

ఉపవాసం…భక్తితోపాటు..ఆరోగ్యానికి కూడా మంచిది. వారానికి ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉంటే…శరీరం పునరుత్తేజం అవుతుందని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే ఉపవాసం ఉన్నాం కదా అని కొందరు కాపీలు, టీలు తెగా తాగేస్తుంటారు. ఇది అస్సలు మంచికాదని..అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో ఒకటి రెండు సార్లు కాఫీ తాగవచ్చు. కానీ పరిమితికి మించి తాగితే మాత్రం ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

ప్రయోజనాలు….
కాఫీ అనేది ఆకలిని కొంత సమయం వరకు తొక్కి పెడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొద్ది మొత్తంలో తీసుకుంటే ఫరవాలేదట. అయితే ఉపవాసం సమయంలో ముఖ్యంగా 12-14గంటల పాటు ఏం తినకుండా ఉంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో కాఫీ తాగడం ఇబ్బందులు తెచ్చి పెడుతుందని హెచ్చరిస్తున్నారు. దీనికి కాఫీలోఉండే కెఫైన్ కారణం అని వివరిస్తున్నారు.

ఎలాంటి సమస్యలు వస్తాయి.?

1. ఎసిడిటి
మన గొంతులోని ఆహారనాళం, జీర్ణాశయం కలుసుకునే చోట ఉండే కండరాలను కెఫైన్ వదులు చేస్తుంది. దీంతో జీర్ణాశయంలోని ఏసిడ్ శక్తి పైకి వస్తుంది. దీంతో ఛాతీలో మంట మొదలవుతుంది. దీనినే గ్యాస్ట్రోసోఫేగల్ రిఫ్లక్స్ డిసిజ్ అంటారు.

2. తీవ్ర ఉద్వేగం
ఎవరైనా తీవ్ర ఉద్వేగంతో, ఉద్రేక పరిస్థితుల్లో ఉంటే కాఫీ దాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా ఉపవాసం సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి అలాంటివారు కాఫీకి దూరంగా ఉండాలి.

3. గుండె జబ్బులు:
గుండె జబ్బులున్నవారు కూడా ఉపవాసం పాటిస్తున్నప్పుడు కాఫీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్ రక్తపోటును , గుండె కొట్టుకునే వేగాన్ని రెట్టింపు చేస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు కాఫీ దూరంగా ఉండటం మంచిది.

4. హార్మోన్ల అసమతుల్యత :
ఎక్కువగా కెఫీన్ తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. పలు రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.

5. థైరాయిడ్ ససమ్యలు:
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే…దానికి మందులు వాడుతున్నప్పుడు కాఫీకి దూరంగా ఉండాలి. ఇదివారి సమస్య పెరిగేందుకు కారణం అవుతుంది. థైరాయిడ్ మందులను శరీరం సరిగ్గా శోషించుకోలేకపోతుంది.

6. జీర్ణాశయ సమస్యలు :
జీర్ణాశయంలో ఆహార కదలికలకు కీలకమైన గ్యాస్ట్రిన్ హార్మోన్ ఉత్పత్తిని కెఫీన్ ప్రేరేపిస్తుంది. అందుకే కొదరు కాపీ తాగగానే టాయిలెట్ కు వెళ్తుంటారు. ఒక కెఫీన్ తోపాటు ఇతర జీర్ణ రసాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది డయేరియా, ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.