Site icon HashtagU Telugu

Hypothyroidism Diet : మీకు హైపోథైరాయిడిజం ఉందా? అయితే వీటిని తినకండి..!!

Hypothyroidism

Hypothyroidism

మన శరీరంలో కనిపించే ఎండోక్రైన్ గ్రంధులలో థైరాయిడ్ కూడా ఒకటి. ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఇది శరీరంలోని అనేక రకాల జీవక్రియ ప్రక్రియలను నియంత్రించేందుకు పనిచేస్తుంది. థైరాయిడ్ వల్ల గాయిటర్ వంటి చిన్న చిన్న జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు సమస్యలకు దారి తీస్తుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి.

1. హైపర్ థైరాయిడిజం
2. హైపోథైరాయిడిజం
హైపోథైరాయిడిజం అంటే ఏమిటి?
హైపోథైరాయిడిజం అంటే ఒక వ్యక్తి యొక్క థైరాయిడ్ గ్రంధి అనేక శరీర విధులకు అవసరమైన థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతుంది. దీంతో అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. హైపోథైరాయిడిజమ్‌ను అండర్‌యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. ఇది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది.

హైపోథైరాయిడిజం ఉన్నవారు వీటిని తినకూడదు

1. అయోడిన్ రిచ్ ఫుడ్స్:
అయోడిన్ లోపం వల్ల కూడా హైపోథైరాయిడిజం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అయోడైజ్డ్ ఉప్పుతో పాటు అయోడిన్-రిచ్ పదార్థాలను తినమని వైద్యులుచెబుతారు. కానీ దానిని ఎక్కువగా తీసుకోవడం వలన కూడా అనేక సమస్యలు వస్తాయి. వాటిలో ఒకటి థైరాయిడ్ గ్రంధి పనిచేయడం మందగిస్తుంది.

2. జంక్ ఫుడ్ మానుకోండి
జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వాటిని తినడం పూర్తిగా మానుకోండి. జంక్ ఫుడ్ తోపాటు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కూడా తినకూడదు.

3. కాఫీ ,టీ మానేయండి
హైపోథైరాయిడిజంతో బాధపడేవారికి కాఫీ, టీలు ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం (లేదా 2-3 సాధారణ కాఫీలు) థైరాయిడ్ సమస్యలను మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంటుంది.

4. సోయా
సోయాబీన్స్ సోయా-కలిగిన ఆహార పదార్థాలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. ఇది థైరాయిడ్ హార్మోన్లను తయారు చేసే ఎంజైమ్‌ల పనితీరుకు ఆటంకం కలిగిస్తుందని పరిశోధనలో తేలింది.

5. పరిమితంగా ఐరన్ కాల్షియం తీసుకోండి
వీటన్నింటితో పాటు, కాల్షియం, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనేక థైరాయిడ్ ఔషధాల ప్రభావం తగ్గుతుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే వాటిని తినండి.

హైపోథైరాయిడిజం లక్షణాలు
– అలసట
– మలబద్ధకం
– జుట్టు రాలడం, పొడిబారడం
– బరువు పెరగడం
– చర్మం పొడిబారడం
– చలిగా అనిపించడం
– కీళ్ల నొప్పులు

Exit mobile version