Site icon HashtagU Telugu

Diabetes: “ఫ్రోజెన్‌ షోల్డర్‌” కు బ్లడ్ షుగర్ కు లంకె ఉందంట !?

Diabetes Test Imresizer

Diabetes Test Imresizer

“ఫ్రోజెన్‌ షోల్డర్‌” అనే భుజం నొప్పి సమస్య కొందరిని వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వాళ్లలో భుజంనొప్పికి కారణం అవుతుంది. ఇదెలా వస్తుంది ? ఎందుకు వస్తుంది ? అనే విషయం చాలామందికి తెలియదు. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లోనే ఇది కనిపిస్తుంది. షుగర్ వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా భుజం భాగంలోని కణజాలాలను ఒకదాన్ని మరో దానితో జోడించే కీలకమైన ప్రోటీన్ పేరు “కొలా జెన్”. షుగర్ రోగుల బ్లడ్ షుగర్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నప్పుడు “కొలా జెన్” లో మార్పులు చోటుచేసుకుంటాయి. షుగర్ అనేది “కొలా జెన్” కు అటాచ్ అయితే.. కొలా జెన్ ప్రోటీన్ స్టికీ గా తయారవుతుంది. దీనివల్ల భుజం భాగంలోని కణజాలం కదలికలు సాఫీగా జరగవు. ఈ దశలో మనము బలవంతంగా భుజాన్ని కదిల్చే ప్రయత్నం చేస్తే.. తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీంతో భుజాన్ని కదిల్చేందుకు చెప్పరాని బాధ పడాల్సి వస్తుంది. “ఫ్రోజెన్‌ షోల్డర్‌” సమస్య దాదాపు 6 నెలల నుంచి 9 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు ఈ భుజం నొప్పి తీవ్రతను తెలుపుతాయి.

పరిష్కార మార్గాలు..

భుజం కీలు దగ్గరి గుళిక భాగం సాగడానికి కావాల్సిన ఫిజియో థెరపీ ఎక్సర్‌సైజుల వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి తగ్గడానికి మందులు వాడితే సరిపోతుంది. కొన్నిసార్లు నొప్పి తగ్గించడానికి భుజం కీలులోకి ఇంజెక్షన్‌ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్‌ ద్వారా చేసే ఆర్థ్రోస్కోపిక్‌ సర్జరీ కూడా అవసరం అవుతుంది. ఈ ఆపరేషన్‌ తర్వాత అదేరోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. నొప్పి నుంచి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. త్వరగా కోలుకోవడానికి భుజం ఎక్సర్‌ సైజులు చేయాల్సి ఉంటుంది.
వృద్ధుల్లోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Exit mobile version