Navratri: మహా అష్టమి, మహా నవమి తేదీలు, శుభ ముహూర్తం వివరాలివీ..

నవరాత్రుల తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవి. ఇవి మార్చి 22న ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజులు దుర్గామాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. చైత్ర శుక్ల ప్రతిపద తిథి

Navratri : నవరాత్రుల (Navratri) తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవి. ఇవి మార్చి 22న ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజులు దుర్గామాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. చైత్ర శుక్ల ప్రతిపద తిథి నుంచి ప్రారంభమై నవరాత్రులు నవమి తిథి రోజున ముగుస్తాయి. ఈసారి చైత్ర నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే హిందూ నూతన సంవత్సరం చైత్ర నవరాత్రుల (Navratri) నుండే ప్రారంభమైంది.  దేశమంతటా నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రులలో రెండు ముఖ్యమైన రోజులు “అష్టమి” మరియు “నవమి”.  అష్టమి మరియు నవమి రోజున, ప్రజలు ఉపవాసం ఉంటారు. వారి ఇళ్లలోని, కుటుంబాల్లోని పెళ్లి కావాల్సి ఉన్న ఆడపిల్లలను పూజిస్తారు.  పెళ్లి కావాల్సి ఉన్న ఆడపిల్లలను దుర్గా స్వరూపంగా భావిస్తారు.

మహా అష్టమి ఎప్పుడు?

అష్టమిని దుర్గాష్టమి, మహా అష్టమి అని కూడా అంటారు. నవ రాత్రులలో ఎనిమిదో రోజున అమ్మ మహాగౌరీని పూజిస్తారు. మా మహాగౌరిని స్వచ్ఛత, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. మహా ష్టమి నాడు తొమ్మిది చిన్న కుండలను ఏర్పాటు చేస్తారు. వాటిలో దుర్గామాత యొక్క తొమ్మిది శక్తులను ఆవాహన చేస్తారు. అష్టమి ఆరాధన సమయంలో దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు.  ఈ సంవత్సరం అష్టమి మార్చి 29న బుధవారం రోజు వస్తోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. అష్టమి తిథి మార్చి 28న బుధవారం రాత్రి 07:02 గంటలకు ప్రారంభమై మార్చి 29న రాత్రి 09:07 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు ఉదయం 04.42 నుంచి 05.29 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది.

మహా నవమి ఎప్పుడు?

నవమి లేదా మహానవమి అంటే.. నవరాత్రులలో తొమ్మిదో రోజు. మహా నవమి నాడు దుర్గాదేవిని మహిషాసుర మర్దిని రూపంలో పూజిస్తారు. మహానవమి రోజున దుర్గ మాత మహిషా సురుడిని సంహరించిందని నమ్ముతారు. నవరాత్రి తొమ్మిదో రోజున, భక్తులు దుర్గామాత యొక్క తొమ్మిదో అవతారమైన మాతా సిద్ధిదాత్రిని కూడా పూజిస్తారు. ఈ సంవత్సరం నవమి మార్చి 30న గురువారం రోజు వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. నవమి తిథి మార్చి 29న రాత్రి 09:07 గంటలకు ప్రారంభమై మార్చి 30న రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది. ఇది కాకుండా బ్రహ్మ ముహూర్తం ఉదయం 04:41 గంటలకు ప్రారంభమై 05:28 గంటలకు ముగుస్తుంది. అభిజీత్ ముహూర్తం 12.01 నుంచి 12.51 వరకు నడుస్తుంది. గురు పుష్య యోగం, అమృత సిద్ధి యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం వంటి కొన్ని శుభ యోగాలు కూడా మహానవమి రోజున ఏర్పడ బోతున్నాయి. మహానవమి రోజంతా సర్వార్థ సిద్ధి యోగం  ఉంటుంది.

Also Read:  Guinness Record: 9 ఏళ్ల బాలుడి గిన్నిస్ రికార్డు.. 4 సెకన్లలోనే రూబిక్స్ క్యూబ్‌ పరిష్కారం