Samantha Career: యశోద మూవీపైనే సమంత ఆశలు.. హిట్ కొడితినే ‘స్టార్ డమ్’

టాలీవుడ్ బ్యూటీ యశోద మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 04:02 PM IST

టాలీవుడ్ బ్యూటీ యశోద మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఓన్లీ సమంతను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న మూవీ ఇది. ఈ సినిమా నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత సింగిల్ హ్యాండ్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని యశోద చిత్ర నిర్మాతలు ధీమాతో ఉన్నారు. అయితే ఈ సినిమా డల్ సీజన్‌లో రిలీజ్ అవుతుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్ 21 , నవంబర్ 11 మధ్య చాలా సినిమాలు విడుదలకు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో అవతార్ తో పాటు మరికొన్ని బాలీవుడ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రేక్షకులు సాధారణంగా పెద్ద సినిమాలను చూసేందుకు ఇష్టపడతారు. అయితే సమంత యశోద మూవీతో విజయాన్ని అందుకోగలిగితే దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్‌గా కీర్తించబడుతుంది. కానీ సినిమా ఫెయిల్ అయితే బాక్సాఫీస్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది.