AP Employees : ఉద్యోగ సంఘం నేతకు జగన్ మార్క్ తీర్పు?బండి తడాఖా

ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఔట్ కానున్నారు.

  • Written By:
  • Publish Date - January 21, 2023 / 02:46 PM IST

ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (AP Employees) అధ్యక్షుడు సూర్యనారాయణ ఔట్ కానున్నారు. తాజాగా గవర్నర్ కు ఫిర్యాదు వెనుక చోటు చేసుకున్న పరిణామాల పైన కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. సూర్యనారాయణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి. తాజాగా నెల్లూరు, ఏలూరు, విశాఖ జిల్లాల్లో ఉద్యోగుల బదిలీకి సంబంధించి ఆయన సిఫార్సులకు అనుగుణంగా అధికారులు నిర్ణయాలు తీసుకోలేదని తెలుస్తోంది. దీని పైన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గుల్జార్,అదనపు కమిషనర్ క్రిష్ణ మోహన్ రెడ్డితో సూర్యనారాయణ వాగ్వాదానికి దిగిరని టాక్. ఉన్నతాధికారులతో సూర్యనారాయణ ఉన్న సమయంలోనే ఉద్యోగులు కొందరు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసారు.

సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పడిందని ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సంఘం పైన కోర్టులో కేసులు వేసారు. ఈ సంఘం పైన ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తాజాగా ఏపీ ఎన్జీవో సంఘ నేత ప్రకటించారు. ఈ సంఘం ఏర్పాటుకు నిబంధనలు ఏం చెబుతున్నాయనే కోణంలో అధికారులు సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల్లొ చర్చనీయాంశంగా మారిన సూర్యనారాయణ అంశంలో ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఆ వీడియో కొందరు ఉద్యోగుల మధ్య సర్క్యులేట్ అయినట్లు తెలుస్తోంది.పోస్టింగులపైన అధికారులు తమ నిర్ణయం మార్చుకోకపోవటంతో సూర్యనారాయణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు. దీని పైన విచారణ చేసిన నివేదిక ఇవ్వాలని అదనపు కమిషనర్ క్రిష్ణ మోహన్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది.

పోస్టింగుల విషయంలో సూర్యనారాయణ(Suryanarayana) వ్యవహార శైలిపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనకు నోటీసు జారీ చేసారు. సూర్యనారాయణకు ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించలేదు. అధికారుల నోటీసుకు సూర్యనారాయణ సమాధానం ఇవ్వలేదు. ఇది కొనసాగుతున్న సమయంలోనే సూర్యనారాయణ గవర్నర్ ను కలిసారు. ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సూర్యనారాయణ తీరు పైన తోటి ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.సూర్యనారాయణ పైన బండి కొత్త ఆరోపణలు చేసారు. వీటిని సూర్యనారాయణ తిప్పి కొట్టారు. ఈ సమయంలో సూర్యనారాయణ పైన ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా సూర్యనారాయణ పైన చర్యలకు రంగం సిద్దం అయినట్లు సమాచారం.

సంఘ నేత సూర్యనారాయణ పైన చర్యలకు రంగం సిద్దం అవుతోంది. గవర్నర్ ను కలిసి ఆయన చేసిన ఫిర్యాదుల వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోతో (AP NGO) సహా ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో సూర్యనారాయణ ఈ రకంగా వ్యవహరించట పైన ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం అటు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ అధికారుల సిఫార్సుల మేరకు సూర్యనారాయణ పైన చర్యలకు సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటుగా సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు పై చర్చ మొదలైంది. దీంత అటు సూర్యనారాయణ ఇటు ఆయన సంఘం పైన ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయో ఆసక్తికరంగా మారింది.