Viral: బ్రతికున్న కూతురికి పిండం పెట్టిన తండ్రి

యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబ సభ్యులు తమ పెళ్ళికి నిరాకరించారు. ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేక ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకున్నారు.

Viral: యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబ సభ్యులు తమ పెళ్ళికి నిరాకరించారు. ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేక ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకున్నారు. అనుకున్నట్టే ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతీ తండ్రి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తనను కాదని వెళ్లిపోయిన కూతురితో బంధం తెంచుకోవాలి అనుకున్నాడు. కుమార్తె బ్రతికి ఉండగానే ఆమెకు పిండం పెట్టాడు. ఆ పిండాన్ని గంగా నదిలో దానం చేశాడు. విశేషమేంటంటే తన కూతురు పిండ ప్రధానానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక ముద్రించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొంత కాలంగా ఆమె ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరూ సొంత కులం కాకపోవడంతో అమ్మాయి బంధువులు పెళ్ళికి నిరాకరించారు. దీంతో మే 20న ఆ యువతి తన ప్రేమికుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరూ ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారని తండ్రికి తెలియడంతో మనస్థాపానికి గురయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు గుండెల మీద తన్ని వెళ్లిపోవడంతో కుంగిపోయాడు. దీంతో కఠిన నిర్ణయానికి పాల్పడ్డాడు. కూతురితో బంధం తెంచుకోవాలనుకున్నాడు. కస్గంజ్‌లోని సోరోన్‌లో ఉన్న గంగా ఘాట్‌లో ఆమెకు పిండ ప్రధానం చేశాడు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆహ్వాన పత్రిక ముద్రించాడు.

Read More: Worlds Tallest Tree : స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైన చెట్టు.. ఎక్కడ ?