ASTR War On Fake Sims : 36 లక్షల ఫేక్ సిమ్స్ బ్లాక్.. ఏమిటీ ASTR ?

ASTR War On Fake Sims : ఫేక్ డాక్యుమెంట్స్ .. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్.. హ్యాక్ చేసిన ఇతర వ్యక్తుల డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు పొందేందుకు ట్రై చేసే చీటర్లకు అస్త్ర ( ASTR) చెక్ పెడుతోంది.

  • Written By:
  • Updated On - May 17, 2023 / 11:40 PM IST

ASTR War On Fake Sims : ఫేక్ డాక్యుమెంట్స్ .. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్.. హ్యాక్ చేసిన ఇతర వ్యక్తుల డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు పొందేందుకు ట్రై చేసే చీటర్లకు అస్త్ర ( ASTR) చెక్ పెడుతోంది. పరమ్ సిద్ధి అనే సూపర్ కంప్యూటర్ ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో పనిచేసే అధునాతన సాఫ్ట్ వేర్  టూల్ ఇది. దీన్ని భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ (డీవోటీ) విభాగం 2022 సంవత్సరం నుంచే యాక్టివ్ గా వినియోగిస్తోంది. సిమ్ కార్డు పొందడానికి వినియోగదారులు టెలికాం కంపెనీలకు అందించే ఫోటోలను అస్త్ర సాఫ్ట్ వేర్ (ASTR War On Fake Sims) స్కాన్ చేస్తుంది. సిమ్ కు అప్లై చేసేటప్పుడు దరఖాస్తుదారుడు దిగిన ఫోటోలోని ముఖం.. ఆ వ్యక్తి సమర్పించిన డాక్యుమెంట్ లోని ఫోటోతో కనీసం 97.5% మ్యాచ్ కావాలి. అలా మ్యాచ్ అయిన సిమ్ కార్డు అప్లికేషన్ ను మాత్రమే అస్త్ర ( ASTR) అప్రూవ్ చేస్తుంది. ఫోటోలు, పేర్లు, అడ్రస్ వంటి సమాచారంలో తేడాలు ఉండే అప్లికేషన్ ను రద్దు చేస్తుంది.

also read : SIM Cards: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో మీకు తెలుసా…?

87 కోట్ల సిమ్ కార్డులను జల్లెడ పట్టి..

2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేశంలో 87 కోట్ల సిమ్ కార్డుల సమాచారాన్ని అస్త్ర ( ASTR) సాఫ్ట్‌వేర్ చెక్ చేసి.. 36.61 లక్షల ఫేక్ సిమ్ కార్డులను గుర్తించి క్యాన్సల్ చేసింది. సైబర్ మోసాలకు పాల్పడేందుకు ఈ సిమ్ కార్డులను కొన్ని ముఠాలు వాడుతున్నాయని గుర్తించారు. నకిలీ సమాచారం, నకిలీ పత్రాలతో ఆ సిమ్ కార్డులు కొన్నారని అస్త్ర ( ASTR) గుర్తించి బ్లాక్ చేసింది. నకిలీ సిమ్ కార్డులను విక్రయించిన 7 సంస్థలకు (పాయింట్ ఆఫ్ సేల్) సంబంధించిన సమాచారాన్ని కూడా అస్త్ర ( ASTR) బయటపెట్టింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న టెలికాం కంపెనీలు ఆ 7 పాయింట్ ఆఫ్ సేల్ లను బ్లాక్‌లిస్ట్ లో పెట్టింది. సిమ్ కార్డు చీటింగ్ వ్యవహారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ FIRలు నమోదయ్యాయి. అస్త్ర ( ASTR) ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ గుర్తించిన ఓ చీటర్.. వివిధ పేర్లతో 6,800 సిమ్ కార్డులు తీసుకున్నాడని వెల్లడైంది. ఇంకో చీటర్ ఇలాగే 5,300 సిమ్ కార్డులు పొందాడని తేలింది.

ఈ రాష్ట్రాల్లో అత్యధిక ఫేక్ సిమ్ కార్డ్స్

2022 నుంచి ఇప్పటివరకు నకిలీ సిమ్ కార్డులు ఎక్కువ సంఖ్యలో బయటపడిన రాష్ట్రాల జాబితాలో వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. వెస్ట్ బెంగాల్ లో 12.34 లక్షలు, హర్యానాలో 5.24 లక్షలు, బీహార్ , జార్ఖండ్ లలో 3.27 లక్షలు, మధ్యప్రదేశ్ లో 2.28 లక్షలు, యూపీలో 2.04 లక్షలు, గుజరాత్ లో 1.29 లక్షల నకిలీ సిమ్ కార్డులను గుర్తించి బ్లాక్ చేశారు. పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్‌)లు ఎక్కువ సంఖ్యలో బ్లాక్ లిస్ట్ అయిన ఏరియాల్లో ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం (13,067), పశ్చిమ బెంగాల్ (10,915), కోల్‌కతా (3,937), హర్యానా (3,024), బీహార్‌, జార్ఖండ్ (2,904), ఒడిశా (2,417) ఉన్నాయి.

also read : Simcards : మీ ఆధార్ మీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో ఇలా తెలుసుకోండి

మీ పేరు మీద మరొకరు సిమ్ తీసుకుంటే.. ఇలా బ్లాక్ చేయించండి

మీ పేరు మీద.. మీ డాక్యుమెంట్ తో మరొకరు ఎవరైనా మొబైల్ ఫోన్ కనెక్షన్ ను తీసుకొని ఉండొచ్చనే అనుమానం కలిగితే తెలుసుకోవడం చాలా ఈజీ. ఇందుకోసమే కేంద్ర టెలికాం డిపార్ట్‌మెంట్ ‘సంచార్ సాతీ’ పేరుతో కొత్త పోర్టల్ ను లాంచ్ చేసింది. దీనిలోకి వెళ్లి మీరు ఫిర్యాదును నమోదు చేస్తే.. మీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్న సిమ్ కార్డును బ్లాక్ చేస్తారు. sancharsaathi.gov.in పోర్టల్ లో ‘మీ మొబైల్ కనెక్షన్‌లను తెలుసుకోండి’ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి .. మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయండి . ఆ తర్వాత OTPని నమోదు చేయగానే.. మీ KYC పత్రాలతో ఉన్న అన్ని సిమ్ కార్డుల వివరాలు ప్రత్యక్షం అవుతాయి. మనం ఉపయోగించని నెంబర్ ఆ లిస్ట్ లో ఉంటే.. దానిపై క్లిక్ చేసి ‘నాట్ మై నంబర్’ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ వెంటనే సిమ్ కార్డును టెలికాం కంపెనీలు జాగ్రత్తగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాయి.