Bullet Train Features : బుల్లెట్ రైలు విశేషాలతో రైల్వే మంత్రి వీడియో వైరల్.. చూసేయండి

Bullet Train Features : గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల  వేగం.. కేవలం 2 గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం.. నదులపై 24 వంతెనలు.. ఈవివరాలతో భారతదేశపు తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది.

  • Written By:
  • Updated On - February 13, 2024 / 09:01 AM IST

Bullet Train Features : గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల  వేగం.. కేవలం 2 గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం.. నదులపై 24 వంతెనలు.. ఈవివరాలతో భారతదేశపు తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది. ఈమేరకు ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ విశేషాలతో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘‘మోడీ సర్కారు కలలను కాదు.. వాస్తవాలను క్రియేట్ చేస్తోంది’’ అని ఆ వీడియోకు  రైల్వే మంత్రి క్యాప్షన్ పెట్టారు. ‘‘ప్రధాని మోడీ మూడో విడత పాలనలో ‘బుల్లెట్‌ రైలు’ కోసం ఎదురుచూడండి’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి ఇంజినీరింగ్‌ అద్భుతంగా(Bullet Train Features) అభివర్ణించిన అశ్వినీ వైష్ణవ్.. దీన్ని భారత భవిష్యత్తుగా పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

వీడియోలో రైల్వే మంత్రి ప్రస్తావించిన సమాచారమిదీ.. 

  • దేశంలోనే మొదటిసారిగా స్లాబ్‌ ట్రాక్‌ వ్యవస్థతో బుల్లెట్ రైలు వ్యవస్థను మనం నిర్మిస్తున్నాం.
  • భూకంపాలను ముందుగానే గుర్తించే ఏర్పాట్లు బుల్లెట్ రైలు వ్యవస్థలో ఉన్నాయి.
  • బుల్లెట్ రైలు కారిడార్ పరిధిలో 28 స్టీలు వంతెనలు, ఏడు సొరంగాలు, సముద్రగర్భంలో 7 కి.మీ పొడవైన టన్నెల్‌, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వేస్టేషన్లు ఉంటాయి.
  • దాదాపు రూ.1.08 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా 2026లో పట్టాలెక్కుతుంది.
  • ముంబయి- అహ్మదాబాద్ కారిడార్‌లో 2021 నవంబరులో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి.
  • బుల్లెట్ రైలు ప్రాజెక్టు తొలి లైను గుజరాత్‌లోని బిలిమోరా – సూరత్ రూట్‌‌‌లో 2026 ఆగస్టులో పూర్తవుతుంది. ఇది  50 కి.మీల మేర విస్తరించి ఉంటుంది.
  • ఈ ప్రాజెక్ట్ పూర్తయి రైలు పట్టాలెక్కితే రోజుకు 70 ట్రిప్పులతో 35 బుల్లెట్ రైళ్లను నడపనున్నారు.
  • 2050 నాటికి ఈ సంఖ్యను 105 రైళ్లకు పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
  • ఏటా 1.6 కోట్ల మంది ఈ రైలులో ప్రయాణిస్తారని అంచనా.
  • బుల్లెట్ రైలు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర సర్కారు వాటా రూ. 10,000 కోట్లు. గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.5,000 కోట్లను అందజేస్తాయి. మిగిలిన నిధులు 0.1 వడ్డీ రేటుతో జపాన్ నుంచి రుణంగా తీసుకుంటున్నారు.
  • ఈ ప్రాజెక్ట్‌కు జపాన్ దేశం ఆర్ధిక, సాంకేతిక సహకారం అందజేస్తోంది.
  • ప్రపంచంలో తొలిసారి బుల్లెట్ రైలును జపాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకే ఈ విషయంలో జపాన్ సహకారాన్ని భారత్ తీసుకుంటోంది.
  • రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్స్ కూడా స్పందించారు. బుల్లెట్ రైలు పరుగులను చూసేందుకు  తాము కూడా ఆతురతగా ఎదురు చూస్తున్నామన్నారు.

Also Read : New Railway Terminal : హైదరాబాద్‌లో కొత్త రైల్వే టెర్మినల్.. ఎన్ని సౌకర్యాలో తెలుసా ?