Noida Twin Tower: నోయిడా ట్విన్ టవర్స్ ప్లేస్ లో టెంపుల్ లేదా భారీ పార్క్ నిర్మాణం !?

3,700 కిలోల పేలుడు పదార్థాలతో వాటిని కూల్చేయడాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఇప్పుడు దానిపై ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 09:10 AM IST

3,700 కిలోల పేలుడు పదార్థాలతో వాటిని కూల్చేయడాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఇప్పుడు దానిపై ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ ప్లేస్ లో ఏం కట్టబోతున్నారు ? సూపర్‌టెక్ కంపెనీ చేస్తోన్న ప్లాన్ ఏమిటి ? అనే దానిపై హాట్ డిబేట్ జరుగుతోంది. ఆ ప్లేస్ లో భారీ ఆలయాన్ని,
గ్రీన్ పార్క్‌ను కట్టబోతున్నారు అనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి.

రెసిడెంట్స్ అసోసియేషన్ ఏం అంటోంది?

ట్విన్ టవర్స్ కూల్చివేతల ప్రదేశంలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో సూపర్ టెక్ సంస్థ ఉంది. అయితే ఎమరాల్డ్ కోర్ట్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ భన్ సింగ్ టాయోటిక్ మాత్రం అందుకు మేము ఒప్పుకోమని తేల్చిచెప్పాడు. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఆయన అన్నారు.
ఈ స్థలంలో ఆలయంతో సహా అనేక ప్రతిపాదనలు వచ్చినందున సమస్యను చర్చించడానికి త్వరలో నివాసితుల సమావేశం నిర్వహించబడుతుందని ఉదయ్ భన్ సింగ్ అన్నారు. మా సొసైటీ ఆవరణలోని పచ్చటి ప్రదేశంలో ఉన్న ప్రాంతంలో అక్రమంగా జంట గోపురాలు నిర్మించబడ్డాయి. ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మేము అక్కడ ఒక పార్కును ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ ఆలయాన్ని నిర్మించడానికి అనేక మంది నివాసితుల నుండి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. దాని కోసం మేము కొన్ని రోజుల్లో నివాసితులందరితో సమావేశాన్ని నిర్వహించబోతున్నాం, తదనుగుణంగా నిర్ణయం తీసుకోబడుతుందని టియోటియా చెప్పారు.

సూపర్‌టెక్ ఏం అంటోంది?

ఇదిలాఉంటే సూపర్‌టెక్ సంస్థ ఛైర్మన్ ఆర్‌కె అరోరా మాట్లాడుతూ.. ఈ స్థలంలో గృహనిర్మాణ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, అవసరమైతే నివాసితుల సంఘం అనుమతి తీసుకుంటామని చెప్పారు. గ్రీన్ ఏరియా కిందకురాని రెండెకరాల భూమి తమకు ఉందని కంపెనీ తెలిపింది.

ఇంకా బిల్డర్ చేతిలోనే..

కూల్చివేతకు ముందు జంట టవర్లను ఇది సొసైటీకి అప్పగించలేదు గనుక.. స్థల యాజమాన్యం ఇంకా బిల్డర్ చేతిలోనే ఉంది. కానీ ఇక్కడ బిల్డర్ ఏ నిర్మాణమైనా చేపట్టాలంటే అందుకు సొసైటీకి చెందిన సభ్యుల్లో మూడింట రెండువంతులమంది అంగీకారాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాము మళ్ళీ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సొసైటీ చెబుతోంది. టవర్స్ కూల్చివేసిన స్థలంలో రోజూ 300 టన్నుల వేస్ట్ ను తొలగించి రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. బృహత్తరమైన ఈ బాధ్యతను తాము చేపట్టామని ఆసియాలోని ప్రముఖ పర్యావరణ సంస్థ సీఈఓ మసూద్ మాలిక్ తెలిపారు. ఈ వ్యర్థాలను నిర్మాణాల్లో ఉపయోగించే మెటీరియల్ గా మార్చాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. మరి మూడు నెలల్లో ఇదంతా పూర్తి అవుతుందా.. ఎమెరాల్డ్ కోర్టు సొసైటీకి, సూపర్ టెక్ సంస్థకు మధ్యఏదైనా అవగాహన కుదురుతుందా.. అక్కడ ఆలయం గానీ, నివాస సముదాయాలు గానీ వెలుస్తాయా ..లేక మళ్ళీ కోర్టుకెక్కుతారా అన్నది తేలాల్సివుంది.

కోర్టు తీర్పుతో..

సూపర్‌టెక్ సంస్థ యొక్క ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై 40 అంతస్తుల రెండు టవర్లను 2004 లో ప్రతిపాదించారు. సెక్టార్ 93Aలో ట్విన్ టవర్స్ నిర్మించాలని భావించారు. మరుసటి సంవత్స రమే నోయిడా అథారిటీ 14 టవర్లు, తొమ్మిది అంతస్తులను చూపించే బిల్డింగ్ ప్లాన్‌ను మంజూరు చేసింది.దాదాపు 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 900 ఫ్లాట్‌లను వీటిలో నిర్మించారు..కానీ ఈ ప్రణాళిక తరువాత సవరించబడింది. 2012లో నోయిడా అథారిటీ కొత్త ప్రణాళికను సమీక్షించింది.సొసైటీకి చెందిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(RWA) నిర్మాణం చట్టవిరుద్ధమని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టును రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ ఆశ్రయించింది.ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
బిల్డింగ్ కోడ్‌లను తీవ్రంగా ఉల్లంఘించినందున స్వంత ఖర్చుతో భవనాలను కూల్చివేయాలని సూపర్‌టెక్ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది.