Business Ideas: విదేశాల్లో అత్యంత డిమాండ్ ఉన్న పంట ఇదే.. ఈ సాగు చేస్తే రైతులు లక్షాధికారులు కావొచ్చు..!

ఎర్ర బెండకాయ కూరగాయలో అనేక రకాల పోషక మూలకాలు దాగి ఉన్నాయి. దీనిని రెడ్ ఓక్రా (Red Okra) అని కూడా అంటారు. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 01:26 PM IST

Red Okra: ఎర్ర బెండకాయ కూరగాయలో అనేక రకాల పోషక మూలకాలు దాగి ఉన్నాయి. దీనిని రెడ్ ఓక్రా (Red Okra) అని కూడా అంటారు. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది షుగర్ పేషెంట్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మీరు పచ్చి ఓక్రా కూరగాయను చాలాసార్లు తినే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా రెడ్ ఓక్రా కూరగాయను తిన్నారా. దీనికి వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో భారతీయ రైతులు రెడ్ లేడీ ఫింగర్ నుండి అధిక లాభాలను ఆర్జించడానికి కారణం ఇదే. మీరు కూడా ఒకవేళ రైతు అయితే, కూరగాయలను సాగు చేయాలనుకుంటే.. ఈసారి ఇతర కూరగాయలకు బదులుగా ఎర్ర బెండ పంటను పండించండి. ఈ పంట అమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో ఎలా లాభం పొందవచ్చో తెలుసుకోండి.

ఎర్ర బెండకు విదేశాల్లో చాలా డిమాండ్

ఎర్రటి బెండ గొప్పదనం ఏమిటంటే మన దేశంలో కంటే విదేశాలలో దీనికి ఎక్కువగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం విదేశాలలో కూడా రెడ్ ఓక్రా వ్యవసాయం చాలా జరుగుతుంది. విదేశాల్లోని ప్రజలు మాములు బెండకాయ కాకుండా ఎర్రటి బెండ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. నిజానికి దీని వెనుక ఉన్న కారణం ఆకుపచ్చ బెండకాయలో కంటే రెడ్ ఓక్రాలో ఎక్కువ పోషక మూలకాలు ఉండటం దీనికి ప్రధాన కారణం.

Also Read: Smartphones: పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఎందుకు సమస్యగా మారుతున్నాయి? నిపుణులు ఏం చెప్తున్నారంటే..?

ఏయే వ్యాధులకు ఈ బెండకాయ మేలు చేస్తుంది..?

రెడ్ ఓక్రాలో అనేక రకాల పోషక మూలకాలు ఉంటాయి. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఈ ఎర్రటి బెండ షుగర్ పేషెంట్లకు దివ్యౌషధం అని చెబుతారు. ఈ పోషక మూలకాల కారణంగా ఈ రెడ్ ఓక్రాకు డిమాండ్ పెరిగింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలను చూసి ఇప్పుడు డైట్ నిపుణులు కూడా రెడ్ ఓక్రా తినమని సలహా ఇస్తున్నారు.

అయితే మీకు ఏదైనా అలర్జీ వచ్చినట్లులైతే మీరు వైద్యుని సంప్రదించకుండా తెలియని వాటిని తినకూడదు. రైతులు ఎండాకాలంలోనూ, చలికాలంలోనూ ఎర్ర బెండ సాగు చేసుకోవచ్చు. సాగు చేస్తున్నప్పుడే అందులో సాగునీటి కొరత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ పంట దాదాపు 40 నుంచి 50 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంటుంది.