Credit Cards Vs Doubts : క్రెడిట్‌ కార్డు‌లపై సవాలక్ష డౌట్స్.. ఆర్‌బీఐ సమాధానాలివీ

Credit Cards Vs Doubts :క్రెడిట్ కార్డులను చాలామంది విచ్చలవిడిగా వాడేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - April 9, 2024 / 08:05 AM IST

Credit Cards Vs Doubts :క్రెడిట్ కార్డులను చాలామంది విచ్చలవిడిగా వాడేస్తుంటారు. షాపింగ్స్ కోసం, బిల్ పేమెంట్స్ కోసం ఉపయోగిస్తుంటారు. వీటిని వినియోగించే విషయంలో యూజర్లకు కొన్ని డౌట్స్ తరుచుగా వస్తుంటాయి. అలాంటి డౌట్స్‌కు ఇటీవల స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

  • ప్రతీ క్రెడిట్‌ కార్డుకు ఒక క్యాష్ లిమిట్ ఉంటుంది. అర్హులైన కస్టమర్లు రిక్వెస్ట్ చేస్తే.. క్రెడిట్ లిమిట్‌కు మించి డబ్బును వాడుకునే ఆప్షన్‌ను బ్యాంకులు ఇస్తాయి. అయితే కస్టమర్‌కు చెప్పకుండా ఎక్స్ ట్రా క్రెడిట్ లిమిట్ ఇవ్వడం, దానిపై ఛార్జీలను బాదడం అనేది బ్యాంకులు చేయకూడదని ఆర్‌బీఐ చెప్పింది.
  • క్రెడిట్ కార్డు బిల్ సైకిల్‌ను కనీసం ఒకసారైనా మార్చుకోవడానికి కస్టమర్లకు బ్యాంకులు ఆప్షన్‌ ఇవ్వాలి. హెల్ప్‌లైన్‌, ఈ-మెయిల్ ఐడీ, ఇంటరాక్టివ్ వాయిస్‌ రెస్పాన్స్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌ వంటి వాటి ద్వారానూ బిల్లింగ్ సైకిల్‌ తేదీలలో మార్పులు చేసుకునేందుకు యూజర్లకు అవకాశం కల్పించాలి.
  • క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ తీయడం, పిన్‌ మార్చడం, లావాదేవీల పరిమితిని సవరించడం వంటి యాక్టివిటీని చేసినా ఆ కార్డు వినియోగంలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు.
  • అప్లై చేయకున్నా క్రెడిట్ కార్డును మీకు బ్యాంకు పంపితే యాక్టివేట్‌ చేయకూడదు. కస్టమర్లు రిక్వెస్ట్ చేసిన ఏడు రోజుల్లోగా ఎలాంటి ఛార్జీలు లేకుండా క్రెడిట్‌ కార్డు అకౌంటును బ్యాంకులు మూసేయాలి.  ఈక్రమంలో ఏదైనా సమస్య తలెత్తితే ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌కు కస్టమర్ కంప్లయింట్ చేయొచ్చు.

Also Read :Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం వీడియోలు, విశేషాలు ఇవిగో

  • క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్‌ లాస్ట్ డేట్‌లోగా కట్టకపోయారో వడ్డీరహిత గడువు ప్రయోజనం లభించదు. పాక్షిక చెల్లింపులు చేస్తే.. మిగిలిన మొత్తం పై మాత్రమే లావాదేవీ జరిగిన రోజు నుంచి వడ్డీ కట్టాల్సి ఉంటుంది.
  • క్రెడిట్ కార్డు సేవలలో ఏదైనా అసౌకర్యం కలిగితే కస్టమర్లు బ్యాంకు ఫోన్ నంబరుకు కాల్ చేసి లేదంటే మెయిల్ చేసి తమ అసౌకర్యాన్ని వివరించొచ్చు. 30 రోజుల్లోగా స్పందించకున్నా..ఫిర్యాదును రెజెక్ట్ చేసినా నేరుగా ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించాలి.
  • ప్రతీ క్రెడిట్‌ కార్డుపై మనం యాడ్‌ ఆన్‌ కార్డును తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా తీసుకుంటే కార్డుపై ఉన్న బకాయిలను చెల్లించే బాధ్యత ప్రధాన కార్డుదారుడిపైనే ఉంటుంది. అయితే బిజినెస్‌ క్రెడిట్‌ కార్డుల విషయంలో రూల్ మరోలా ఉంటుంది. ఈ కార్డుల వారికి ఒప్పందాల మేరకు చెల్లింపులను డివైడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు.
  • క్రెడిట్‌ కార్డును డీయాక్టివేషన్‌ లేదా బ్లాక్‌ మోడ్‌లో ఉంచినంత మాత్రాన ఆ అకౌంట్ క్లోజ్ అయినట్టు కాదు. మీకు క్రెడిట్ కార్డు వద్దని భావిస్తే.. ఆ అకౌంటును మూసేయాలని బ్యాంకుకు ప్రత్యేకంగా రిక్వెస్టు పెట్టాల్సి ఉంటుంది. దీనిపై కస్టమర్‌ నుంచి రిక్వెస్ట్‌ వచ్చాక.. ఏడు రోజుల్లోగా ఖాతాను మూసేయాలి.
  • క్రెడిట్‌ కార్డుపై ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని బ్యాంకులు తప్పనిసరిగా కల్పించాలనే రూలేదీ లేదు. ఒకవేళ బీమా సౌకర్యాన్ని కస్టమర్లకు కల్పించాలని భావిస్తే.. కస్టమర్ వివరాలు, నామినీ వివరాలను ప్రతి స్టేట్‌మెంట్‌లో విధిగా ప్రస్తావించాలని ఆర్‌బీఐ తెలిపింది.
  • బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులను కార్పొరేట్లు, వ్యాపార సంస్థలకు జారీ చేస్తుంటారు. వీటి యాక్టివేషన్‌, క్లోజర్‌కు ముందు బ్యాంకులు తప్పకుండా సమాచారాన్ని అందించాలి. రిటైల్‌ కార్డుల విషయంలోనూ ప్రధాన కార్డుదారుడి నుంచి పర్మిషన్ తీసుకోకుండా, యాడ్‌ ఆన్‌ కార్డు హోల్డర్ల అభ్యర్థన మేరకు కార్డును క్లోజ్‌ చేయరు.

Also Read :Ugadi Panchangam 2024 : ఈ ఏడాది మీ జాతకం ఎలా ఉందో ఓ లుక్ వేసుకోండి