ISRO Scientists Salary : ఇస్రో శాస్త్రవేత్తల జీతాలెంత..?

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 01:58 PM IST

ఇస్రో (ISRO ) ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. దిగ్గజ దేశాలు సైతం ISRO పేరు గురించి..వీరి పనితనం గురించి మాట్లాడుకుంటున్నారు. జాబిల్లి ఫై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి (చంద్రయాన్ 3) ISRO ఘనత సాధించింది. ISRO పనితనం చూసి పాకిస్థాన్ లాంటి శత్రుదేశాల కూడా శభాష్ ఇండియా అని అంటున్నారంటే అర్ధం చేసుకోవాలి. అలాంటి ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల జీతాలెంత (ISRO Scientists Salary)..? ఇప్పుడు ఇదే అంత మాట్లాడుకుంటున్నారు. ఈరోజుల్లో సాఫ్ట్ వెర్ ఉద్యోగస్తులు నెలకు లక్షకు పైగానే జీతాలు అందుకుంటున్నారు. అంతే ఎందుకు రోజువారీ కూలి చేసే వ్యక్తులు సైతం రోజుకు రూ. 1000 నుండి రూ. 1500 సంపాదిస్తున్నారు.

అలాంటిది ఇప్పటివరకు ఎవ్వరు చేరుకోలేని చంద్రుడి ఫై చంద్రయాన్ 3 పంపించి, అక్కడి రహస్యాలను కనిపెడుతున్న ఇస్రో శాస్త్రవేత్తల జీతాలు ఎంత మేర ఉంటాయో అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అందరు అనుకుంటున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తల జీతాలు లక్షల్లో లేవట. కేవలం వేలల్లోనే ఉన్నాయట. ఇది మీరు నమ్మలేకపోయిన ఇదే నిజం. సాధారణంగా కార్పొరేట్‌లో ఎక్స్‌పీరియెన్స్ ఆధారంగా జీతాలిస్తుంటారు. కానీ…ఇస్రోలో అనుభవంతో పాటు మరి కొన్ని అర్హతలూ ఉండాలి. అలాంటి వాళ్లకే ఎక్కువ జీతాలొస్తాయి. వాళ్లు పని చేసే ప్రాంతం, డిసిగ్నేషన్, ఎడ్యుకేషనల్ బ్యాగ్రౌండ్, ఎక్స్‌పీరియెన్స్..ఇలా చాలా రకాలుగా బేరీజు వేసుకుని జీతాలు నిర్ణయిస్తారు.

బేసిక్ మంత్లీ జీతం రూ.15 వేల నుంచి మొదలవుతుంది. రూ.40 వేల వరకూ జీతాలుంటాయి. మొత్తంగా చూస్తే రూ.15-40వేల మధ్యలోనే శాస్త్రవేత్తల జీతాలుంటాయి. ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ని ఎంపిక చేసుకుంటుంది ఇస్రో. అది కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీలకు చెందిన వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఈ జీతాల అంశం ఫై సోషల్ మీడియా లో అంత మాట్లాడుకుంటున్న తరుణం లో ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి చెందిన దేశాల అంతరిక్ష సంస్థలతో పోల్చుకుంటే ఇస్రో ఇచ్చే జీతాలు 5 రెట్లు తక్కువ అని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐదింట ఒక వంతు మాత్రమే ఇస్రో సైంటిస్ట్‌లకు వేతనాల రూపంగా అందుతోందని వెల్లడించారు. ఈ కారణంగానే ఇస్రో శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చులోనే అనుకున్న ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ఇస్రో సైంటిస్ట్‌లలో ఒక్కరు కూడా లక్షాధికారి లేరని, చాలా సింపుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారని తేల్చి చెప్పారు. మాధవన్ చెప్పిన మాటలు చూసి నిజమే కావొచ్చు..తక్కువ జీతంతో దేశానికి ఎంత గొప్ప పేరు తీసుకొస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు నిజంగా రియల్ హీరోస్ అనాల్సిందే.

Read Also : Jagan Board : గోవిందా..హ‌ల లూయా.!TTD భాగోతం!!